సమయం ఇస్తాం..అసెంబ్లీకి రండి

యూరియా సమస్య మీద బయట కాదని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు.;

Update: 2025-09-08 13:39 GMT

అసెంబ్లీకి రావాలని, ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, మాట్లాడేందుకు, చర్చల్లో పాల్గొనేందుకు సమయం కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. 18 నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆయన వారిని ఆహ్వానించారు. సోమవారం ఆయన అనకాపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ యూరిమా మీద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని ఆయన పేర్కొన్నారు. సభలోని అందరు సభ్యులకు ఇస్తున్నట్టుగానే, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సమయం కేటాయిస్తామని, అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాల మీద చర్చంచొచ్చని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Tags:    

Similar News