ఏపీ లిక్కర్ స్కాంపై పార్లమెంట్ లో చర్చిస్తాం

ఏపీలో భారీ లిక్కర్ కుంభకోణం అంటూ పార్లమెంట్ లో చర్చకు రెడీ అవుతున్న తెలుగుదేశం;

Update: 2025-07-21 14:13 GMT

ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటికే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంటే , ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనూ ఈ అంశం హైలెట్ కానుంది. 3వేల కోట్ల రూపాయల పైగా భారీ కుంభకోణం లిక్కర్ అమ్మకాలలో వైసీపీ హయాంలో జరిగిందని , పార్లమెంట్ లో చర్చను లేవనెత్తడానికి టీడీపీ సిద్దమయింది.ఈ స్కామ్ పై లోక్ సభలో చర్చిస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జగన్ చేసిన దురాగతాలను బట్టబయలు చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయాన్ని గుర్తుచేశారు.మరోవైపు పార్లమెంట్ లో రైతు సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై కూడా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.అక్రమ కేసుల విషయాన్ని పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తాలని వైసీపీ ఎంపీలూ సమాయత్తమవుతున్నారు.
Tags:    

Similar News