మహనీయుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి

రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు.;

Update: 2025-08-15 08:35 GMT

స్వాతంత్ర్య సమరంలో ఎందరో వీరులు, యోధులు నేలతల్లి రుణం తీర్చుకోవడానికి తమ ప్రాణాలను అర్పించారనీ, ఆ మహనీయుల ఆశయాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృధ్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్‌.రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల సమితి కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర వేడుకలను సమితి కార్యవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ..

కులమతాలకు అతీతంగా, బీద గొప్ప తేడా లేకుండా, భిన్నత్వంలో ఏకత్వంగా మన భారత జాతి ఖ్యాతిని నిలబెట్టే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం అని తెలిపారు. స్వతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా చాలా ప్రాంతాలలో త్రాగు, సాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు చిత్తశుద్దితో పని చేసినప్పుడే స్వతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలకు ఫలితం వుంటుందని స్పష్టం చేసారు.
ఈ జెండా పండుగ వేడుకలలో సమితి కార్యవర్గ సభ్యులు ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, మహమ్మద్‌ ఫర్వేజ్, మహేశ్వరరెడ్డి, సౌదాగర్‌ ఖాసీం మియా, నిట్టూరు సుధాకర్‌ రావు, కొమ్మా శ్రీహరి, భాస్కర్‌ రెడ్డి, పట్నం రాముడు, మహబూబ్‌ భాష, న్యాయవాది అసదుల్లా, కృష్ణమోహన్‌ రెడ్డి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News