ABUSE | డాడీ..నన్ను పాడు చేయోద్దు అంటున్నా వినని మారుతండ్రికి శిక్ష!
డాడీ.. నీ కూతురు లాంటి దాన్ని డాడీ.. ఇదేం పని డాడీ అంటూ ప్రాధేయపడుతున్నా వినని ఓ మారుతండ్రికి విశాఖపట్నం పోక్సో కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.;
By : The Federal
Update: 2024-12-06 06:53 GMT
డాడీ.. నీ కూతురు లాంటి దాన్ని డాడీ.. ఇదేం పని డాడీ అంటూ ప్రాధేయపడుతున్నా వినకుండా లైంగిక దాడికి (CHILD ABUSE ) పాల్పడిన ఓ మారుతండ్రికి విశాఖపట్నం పోక్సో ప్రత్యేక కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పాడ్డడని కోర్టు ధృవీకరించింది. 25 ఏళ్ల జైలు శిక్ష,1.25 లక్షల రూపాయల జరిమానా విధించింది. విశాఖపట్నంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది డిసెంబర్ 5న ఈ తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
అనకాపల్లి జిల్లా సబ్బవరం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోతే దర్శి త్రినాథ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు. రెండో సంబంధం చేసుకున్న తర్వాత వాళ్లకి ఇంకో పాప కూడా పుట్టింది. సరిగ్గా ఈ దశలో త్రినాథ్ వ్యసనాలకు బానిస అయ్యారు. ప్రతి నిత్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఏదో రకంగా గొడవ పెట్టుకునే వాడు. ఓ రోజు తాగి ఇంటికి వచ్చిన త్రినాథ్ తనకు కూతురు వరుసయ్యే 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని ఆ పాప ప్రతిఘటించే శక్తి లేక బతిమిలాడినా ఈ సవతితండ్రి వినలేదు. అయినప్పటికీ ఆ పాప త్రినాథ్ ని డాడీ అని పిలుస్తూనే ఉండేది. ఇలా మూడేళ్ల పాటు ఆ కసాయి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయి, తన చెల్లితో కలిసి విజయనగరం జిల్లా ఆలమండలో ఉంటున్న తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి పెద్దమ్మ కు తెలియజేసింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లి తన భర్త త్రినాథ్ పై 2022 మే 22వ తేదీన అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై దిశా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. రెండేళ్ల విచారణ అనంతరం విశాఖపట్నంలోని పాక్సో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జి.ఆనంది గురు వారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించ కపోతే అదనంగా మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టంచేశారు. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.4ల క్షలు చెల్లించాలని జడ్డి ఆదేశించారు.