పోలీసులను టార్గెట్ చేసిన 'వర్రా'
పోలీసులు నన్ను టార్చర్ చేశారు. కడప ఎంపీ పేరు చెప్పమంటున్నారు. అని వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా ఆరోపణలు ఇరుకుప పడేశాడు.
వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి. పోలీసులకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. రవీంద్రారెడ్డిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అర్ధరాత్రి కడప రెండవ ఏడీజేఎం జడ్జి ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆ సమయంలో "పోలీసులు నన్ను టార్చర్ చేశారు" అని తన శరీరంపై గాయాలు జడ్జికి చూపించినట్లు తెలిసింది. అంతేకాకుండా, "నన్ను శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు చెబితేనే వైఎస్. సునీత, వైస్ షర్మిలపై పోస్టులు పెట్టినట్లు ఒప్పుకోమని టార్చర్ చేశారు" అని వర్రా రవీంద్రారెడ్డి జడ్జికి ఫిర్యాదు చేశారని సమాచారం.
ఆ తర్వాత కడప ఏడీజేఏం పోలీసులు అరెస్ట్ చేసిన వర్ర రవీంద్రారెడ్డిని 14 రోజులు రిమాండ్ కు ఆదేశించారు. రవీంద్రారెడ్డికి వైద్య పరీక్షలు చేయించాలని కూడా జడ్జి పోలీసులను ఆదేశించారు. దీంతో, కడప సెంట్రల్ జైలు నుంచి మంగళవారం ఉదయం వర్రా రవీంద్రారెడ్డిని కడపలోని రిమ్స్ (Rims) ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు.