వర్రా రవీంద్రరెడ్డి బాపట్లకు తరలింపు
బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వర్రాను హాజరు పరచనున్నారు.
By : Admin
Update: 2024-11-28 10:58 GMT
సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు అయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని కడప నుంచి బాపట్లకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వర్రా రవీంద్రరెడ్డి కడప జైలులో ఉన్నారు. అయితే పీటీ వారెంట్‌పై వర్రాను కడప జైలు నుంచి బాపట్లకు పోలీసులు తీసుకెళ్లారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై అసభ్యకర, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలతో వర్రా రవీంద్రరెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్రా రవీంద్రరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వర్రా రవీంద్రరెడ్డిని కడప జైలు నుంచి బాపట్లకు పోలీసులు తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు హాజరుపర్చనున్నారు.