వాంతులవుతున్నా కొనసాగిన వంశీ విచారణ

గత పది రోజులుగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.;

Update: 2025-05-24 08:51 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పోలీసులు విచారణ కొనసాంచడంపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు స్టేషన్‌లోనే వాంతులవుతున్నా విచారణ చేపట్టడంపై వంశీ భార్యతో పాటు ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు నిల్చోడానికి కానీ, కూర్చోడానికి కానీ శక్తి లేక పోవడంతో స్పందించిన పోలీసులు వంశీని మెరుగైర చికిత్సల కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.

గత టీడీపీ హయాంలో నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి పాల్పడ్డారనే ఆరోపణలపై వంశీ మీద కేసు నమోదు చేశారు. దీనిపై నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో విచారణ చేపట్టాలని పోలీసులు కోర్టును కోరారు. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతులు జారీ చేసింది. రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం తొలి రోజు విచారణ చేపట్టారు. శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వంశీని శుక్రవారం అలాగే విచారణ చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఈ సమస్య తీవ్రం కావడంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. తర్వాత కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శనివారం రెండో రోజు విచారణ కొనసాంగించారు. అయితే పోలీసు స్టేషన్‌లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో కనీసం కూర్చోడానికి కూడా వంశీ నీరసించి పోయారు. ఈ నేపథ్యంలో కంకిపాడు పోలీసులు వంశీనికి విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే శుక్రవారం రాత్రే మెరుగైన వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలించాలని వంశీ భార్య పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నానిలు పోలీసులను కోరినా పంపకుండా కంకిపాడు పీఎస్‌లోనే ఉంచారని విమర్శలు వినిపిస్తున్నాయి. శనివారం వంశీ ఆరోగ్యం విచారణకు సహకరించక పోవడంతో ఇక చేసేదేమీ లేక విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.
Tags:    

Similar News