ఏపీకి చేరుకున్న కేంద్ర మంత్రి.. ఆ ప్రాజెక్ట్‌లపై చర్చ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ..ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. రాష్ట్రంలోని రోడ్డు ప్రాజెక్ట్‌లపై రాష్ట్రీయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2024-07-17 10:52 GMT

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ..ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునన ఆయనకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం లాంజ్‌లోనే అధికారులతో సమావేశమయ్యారు గడ్కరీ. ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్ట్‌లు, రాష్ట్ర రహదారుల పరిస్థితిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ఆధునికీకరణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అవి ఏ పరిస్థితులో ఉన్నాయి అన్న విషయాలపై ఆరా తీశారు గడ్కరీ. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని కేంద్ర హైవే ప్రాజెక్ట్‌లకు వీలైనంత త్వరగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు కావాల్సిన మౌలికవసతులను రాష్ట్ర ప్రభుత్వం అందిచగలనని చెప్పిన వెంటనే ప్రారంభిస్తామని గడ్కీర చెప్పినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మదనపల్లెకు బయలుదేరారు. ఈరోజు తిరుమల చేరుకుని రేపు తెల్లవారుజామున తిరుపతి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ప్రాజెక్ట్‌లపై చర్చ!

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని ఏపీలోని పలు ఇతర ప్రాంతాలతో, రాష్ట్రాలతో అనుసంధానించేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే పలు రహదారుల ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వీటిలో ఒకటైన 189 కిలోమీటర్ల పొడవుల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్రం ఓకే చెప్పింది. అదే విధంగా విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటు గురించి కూడా గడ్కరీ చర్చించారు. పలు రోడ్డు ప్రాజెక్ట్‌ల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను గడ్కరీ సేకరించారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం అంతనరం ఆయన గురువారం తిరుగు ప్రయాణం కానున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్డు ప్రాజెక్ట్‌ల గురించి ఆయన ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News