కార్మికుల కష్టానికి ‘ఈ-శ్రమ్’తో గుర్తింపు.. ఎన్ని ప్రయోజనాలో..
దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల కష్టం వృథా కాకూడదని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కార్మికుల కష్టానికి గుర్తింపు తీసుకొచ్చేలా ‘ఈ-శ్రమ్’ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల కష్టం వృథా కాకూడదని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కార్మికుల కష్టానికి గుర్తింపు తీసుకొచ్చేలా ‘ఈ-శ్రమ్’ అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన ఈ-శ్రమ్ పోర్టల్‌ను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021లోనే తీసుకొచ్చింది. వలస కార్మికులు, గృహ కార్మికులు సహా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చేలే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కార్మికులు ఈ-శ్రమ్ లేదా శ్రామిక్ కార్డును పొందడం ద్వారా చాలా ప్రయోజనాలు అందుకోగలుగుతారు. వారికి ఈ కార్డులు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అసంఘటిత రంగంలోని ప్రతి కార్మికుడు ఈ కార్డును కలిగి ఉండాలన్నదే తమ లక్ష్యమని కేంద్రం పేర్కొంది.
అసంఘటిత రంగంలో పనిచేసే ఏ కార్మికుడైన ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు దేశంలో ఎక్కడికి వెళ్లినా చెల్లుబాటు అవుతుంది. వారు అక్కడ పనిచేసి వారి కష్టానికి ప్రతిఫలం పొందేలా దీనిని రూపొందించింది కేంద్రం. ఈ కార్డు ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత పింఛన్, మరణ బీమా, వైకల్యం ఉంటే ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. లబ్దిదారులకు ఈ కార్డుపై 12 అంకెల గుర్తింపు నెంబర్ ఇవ్వబడుతుందని, దీని ద్వారా దేశంలో ఎక్కడైనా వారు ప్రయోజనం పొందవచ్చు.
ఎవరెవరు నమోదు చేసుకోవచ్చంటే..
30 విస్తృత పారిశ్రామిక రంగాలలోని 400 వృత్తుల కింద పనిచేసే ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక అసంఘటిత రంగ కార్మికుడు తన స్వీయ ప్రకటన ద్వారా ఈ కార్డుకు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారిలో పాడి రైతులు, చిరువ్యాపారులు, వల కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కలప కట్టర్లు, ప్యాకింగ్ కార్పెంటర్, ఉప్పు కార్మికుడు, సెరికల్చర్ వర్కర్, మత్స్యకారులు, వార్తా గృహోపకరణ కార్మికులు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్ తదితరులు ఈ కార్డును పొందడానికి అర్హులు. ఈ కార్డును పొందడానికి 18-59 ఏళ్ల మధ్య వయసు ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ అర్హులే.
ఈ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు..
ఈ-శ్రమ్ లేదా శ్రామిక్ కార్డు పొందాలంటే కార్మికుడు కచ్ఛితంగా భారతదేశ పౌరుడు అయ్యుండాలి. ఈ కార్డు ఉండటం ద్వారా ప్రతి కార్మికుడికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కార్డు ఉండటం వల్ల కార్మికుడు రూ.2లక్షల వరకు వైద్య బీమా పొందవచ్చు. కార్డు ఉన్న కార్మికులందరికీ ప్రతి నెల రూ.వెయ్య రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భవిష్యత్తులో పింఛన్ పొందవచ్చు. ప్రమాద బీమా, అటల్ పింఛన్ కూడా పొందవచ్చు. వయసు 60 ఏళ్లు దాటితే ప్రతి నెల రూ.3వల వరకు పింఛన్ కూడా అందుతుంది.