విశాఖ టు విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు

విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

By :  Admin
Update: 2024-10-27 05:41 GMT

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణం సులభతరం కానుంది. కేవలం గంటలోనే గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. దీని కోసం విమాన సర్వీసులు పెంచడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడకు కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇవి విజయవాడ, విశాఖల మధ్య తిరగనున్నాయి. వీటిల్లో ఒకటి ఎయిర్‌ ఇండియా విమానం కాగా మరొకటి ఇండిగో ప్లైట్‌. వీటి రాకతో విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం తక్కువ సమయంలోనే చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కేవలం గంటలోనే గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సులువు కానుంది.

అందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులను విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35గంటలకు విశాఖలో బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్‌ పోర్టులో బయలుదేరి 9గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7:15 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 9:50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రెండు కొత్త విమాన సర్వీసులతో కలిపి విశాఖపట్నం టు విజయవాడ మధ్య తిరిగే విమాన సర్వీసుల సంఖ్య మూడుకు పెరగనున్నాయి.
Tags:    

Similar News