Breaking | టైల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఇద్దరి మృతి

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-26 08:21 GMT

ఓ పరిశ్రమలో గ్యాస్ ట్యాంకర్ పేలిన సంఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం కొద్దిసేపటి కిందట జరిగింది. మృతుల్లో ఒకరిది ఒరిస్సా, మరొకరిది చీరాల అని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీకాళహస్తికి రూరల్ మండలం వేలంపాడు గ్రామం వద్ద కొన్ని సంవత్సరాలుగా somany టైల్స్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. రోజు మాదిరే ఈ టైల్స్ ఫ్యాక్టరీలో కార్మికులు పనికి వెళ్లారు. టైల్స్ తయారీలో ఉండగా, ఫ్యాక్టీరీలోని గ్యాస్ ట్యాంకర్ భారీ శద్దంతో పేలినట్టు సమాచారం అందింది.
ఇద్దరి మృతి

ఈ పేలుడు ధాటికి సమీపంలో పనిచేస్తున్న కార్మికుల్లో గుండుపాటి పోతురాజు (చీరాల), ఒరిస్సాకు చెందిన పాండే ఘటనా స్థలంలోనే మరణించారని సమాచారం అందింది. వారితో పాటు పనుల్లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. బాధితులను సమీపంలోని వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇంకా ఎంతమంది కార్మికులు గాయపడ్డారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటనేది తెలియలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి.
Tags:    

Similar News