శ్రీవారిసేవలో ‘ట్రెయిన్ ద ట్రైనీస్’

శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లే.. మాస్టర్ ట్రైనర్ల శిక్షణలో టీటీడీ అదనపు ఈఓ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-02 11:08 GMT

టీటీడీ శ్రీ‌వారిసేవ‌ మ‌రింత బ‌లోపేతం చేయడం, స్వచ్ఛంద సేవకుల్లో నైపుణ్యాల అభివృద్ధికి ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుమల సేవా సదన్–2లో మంగళవారం గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్లు)కు మొదటి విడత శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. 

టీటీడీలో యాత్రికులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు దాదాపు ఐదు లక్షల మంది శ్రీవారి సేవకులు పేర్లు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. యాత్రికులకు వారం రోజులు సేవలు అందించడానికి వస్తున్న సీనియర్ సేవకులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదద్దడానికి టీటీడీ కార్యాచరణ సిద్దం చేసింది. అందులో భాగంగానే.. తిరుమలలో మొదటి బ్యాచ్ మాస్టర్ ట్రైనర్లకు మరింత శక్తివంతమైన సేవలు అందించడానికి అవసరమైన మొదటి బ్యాచ్ శిక్షణను టీటీడీ అదనపు అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంబించి, మాట్లాడారు.  శ్రీ‌వారి సేవ‌కులు హిందూ ధ‌ర్మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా అభివర్ణించారు. దేశ‌విదేశాల నుంచి తిరుమ‌ల‌కు వచ్చే భ‌క్తుల‌కు సేవ చేయ‌డంలో శ్రీ‌వారి సేవ‌కుల పాత్ర అత్యంత కీల‌క‌మైన‌దనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


ఈ కార్యక్రమం ఎందుకంటే..

తిరుమలలో ప్రారంభించిన మొదటి విడత శిక్షణలో అవగాహన చేసుకున్న శ్రీవారి సేవకులే మాస్టర్ ట్రైనర్లుగా ఉంటారని టీటీడీ అదనపు అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి గుర్తు చేశారు. ఈ విషయంపై ఆయన ఏమని స్పష్టత ఇచ్చారంటే..


"ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ద్వారా శ్రీవారిసేవ గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు శిక్ష‌ణ ఇవ్వడానికి  ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం–అహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూళ్నులు రూపొందించారు" అని వెంకయ్చియ చౌదరి తెలిపారు.  ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో న‌డ‌వ‌డిక‌, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు. దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

మీ ఊర్లలో మీరే శిక్షకులు
తిరుమలలో శిక్షణ తీసుకున్న గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లపై గురుతర బాధ్యత ఉందని వెంకయ్య చౌదరి చెప్పారు.

"మీ ప్రాంతాల్లో శ్రీ‌వారిసేవ‌కు పేర్లు న‌మోదు చేసుకున్న వారికి మీరే శిక్షణ ఇవ్వాలి. ఆ తరువాతే వారు తిరుమల లేదా తిరుపతిలో యాత్రికులకు ఎలాంటి సేవలు అందించాలి? ఎలా మెలగాలి అనే అంశాలపై సమగ్రంగా వివరించి, సుక్షితులను చేయాల్సి ఉంటుంది" అని వెంకయ్య చౌదరి మాస్టర్ ట్రైనర్ల పనితీరును వివరించారు. ఈ శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించి, ఇతర సేవకులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి మాట్లాడుతూ, శ్రీవారి సేవకులను మరింత ఆదర్శవంతంగా సేవలు అందించే దిశగా సుక్షితులను చేస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..

"మొదటి బ్యాచ్ లో 150 మందికి శిక్షణా తరగతులు ప్రారంభించాం. ఈ రోజు వంద మంది మాత్రమే హాజరయ్యారు. వారికి వారం రోజులు సేవా సదన్–2లో శిక్షన తరగతులు ఉంటాయి. పది బృందాలకు ఇదే పద్దతిలో సేవలు అందించడంలో మరింత సుక్షితులను చేస్తాం" అని చీఫ్ పీఆర్ఓ రవి తెలిపారు. వీరంతా వారి ప్రాంతాల నుంచి శ్రీవారిసేవకు వచ్చే వారికి ముందుగనే శిక్షణ ఇచ్చే విధంగా తిరుమల, తిరుపతి ప్రత్యేకంగా టీటీడీ ఆచార, వ్యవహారాలు, యాత్రికులకు సేవలు అందించే పద్దతులపై అవగాహన కల్పిస్తారని రవి వివరించారు. ఈ కార్యక్రమంలో పండితులు డాక్టర్ మేడసాని మోహన్, డాక్టర్ దామోదర్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్, టీటీడీ ఛీఫ్ వీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో (FAC) కుమారి నీలిమ, సేవా సదన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News