శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడలేదా.. పద్మావతీదేవి వైభవం చూద్దాం రండి
తిరుపతిలో గోవిందరాజస్వామి, తిరుచానూరు వద్ద అక్టోబర్ లో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవీ..
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-05 09:40 GMT
టీటీడీ అక్టోబర్ 20వ తేన దీపావళి ఆస్థానం నిర్వహించనుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాలు దర్శించుకోలేని వారు తిరుపతి, తిరుచానూరు ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలు కనులారా చూడవచ్చు. ఆ కోవలోనే అక్టోబర్ నెలలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి తోపాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాల్లో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలు టీటీడీ వెల్లడించింది.
తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు అలిమేలు మంగమ్మ, తిరుపతిలోని గోవిందరాజస్వామి వార్లతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలకు కొదవ ఉండదు. యాత్రికులతో రద్దీగా ఉండే తిరుపతి ఆలయాల నగరం ఉత్సవాలతో కళకళలాడుతూ ఉంటుంది. స్వామివార్లకు ఉత్సవాల నిర్వహణకు కూడా ప్రత్యేకంగా ఓ క్యాలెండర్ ఉంటుంది. ఆగమశాస్త్రం, తిథి, నక్షాల ఆధారంగా ప్రతి రోజు ఉత్సవాల నిర్వహణకు టీటీడీ అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ.
అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.
అక్టోబర్ 15 నుంచి 24వ తేదీ వరకు శ్రీతిరుమల నంబి ఉత్సవం, శాత్తుమొరై
అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అక్టోబర్ 18 నుంచి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం.
అక్టోబర్ 19న నరక చతుర్దశి. ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం
పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇవి.
అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. పల్లకీపై ఆశీనులయ్యే పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనం ఇస్తారు.
సుందరరాజ స్వామి ఆలయంలో
అక్టోబర్ 6న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ బలరామ కృష్ణ స్వామి వారికి సాయంత్రం తిరుచ్చి ఉత్సవం.
అక్టోబర్ 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామి తిరుచ్చిపై విహరిస్తారు.
అక్టోబర్ 11, 18, 25 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.