'మృతి చెందిన భక్తులకు దీపాలతో నివాళి'
టీటీడీ పరిపాలన భవనం వద్ద తిరుపతి పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.;
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన శ్రీవారి భక్తులకు దీపాలతో నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిర్వహించారు. సమాఖ్య కన్వీనర్ టి. సుబ్రహ్మణ్యం అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత కందారపు మురళి మాట్లాడారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమన్నారు.
"టీటీడీకి ఇది ఓ మాయని మచ్చలా మిగిలిపోతుంది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి" అని మురళీ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం చాలదన్నారు. తిరుమల కొండపై విఐపి ల సంస్కృతి మార్చాలని, సామాన్య భక్తుడే విఐపి గా మారాలని ఆయన కోరారు. జరిగిన ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి కే. వేణుగోపాల్, ఐద్వా జిల్లా కార్యదర్శి పి. సాయి లక్ష్మి, సిఐటియు నేతలు జయచంద్ర, మాధవ్, ఆర్ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, బాలాజీ, బుజ్జి, నరేంద్ర, రాధాకృష్ణ మల్లికార్జునరావు, జయంతి, కరకంబాడి భాష, బాలోత్సవం నేతలు నేతలు ముని లక్ష్మి, కుప్పస్వామి, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ పద్మజ, పార్థసారధి రెడ్డి, చిట్టిబాబు, యుగంధర్, గంగులప్ప మృతులకు నివాళులు అర్పించారు.