తిరుపతి విద్యార్థుల భగత్ సింగ్ సంస్మరణ
నేటి తరం భగత్ సింగ్, నేతాజీ, అల్లూరీ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలి. సినిమా హీరోలను కాదు.;
By : Admin
Update: 2025-03-24 02:52 GMT
బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానంతోనే నేడు కూడా ప్రజలను కుల, మతాలుగా విడదీస్తున్న నేటి పాలకులను ప్రశ్నించే తత్వం విద్యార్థులలో రావాలి.
ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ఆధ్వర్యంలో స్థానిక ఎమెరాల్డ్స్ డిగ్రీ కాలేజీలో భగత్ సింగ్ సంస్మరణ సభా కార్యక్రమం జరిగింది. 94వ వర్దంతి సందర్భంగా 10 పాఠశాలలో విద్యార్థులకు కాంపిటీషన్లు భగత్ సింగ్ చిత్రం పై డ్రాయింగ్, దేశ స్వాతంత్ర్యోద్యమంలో భగత్ సింగ్ పాత్ర అంశంపై వ్యాసరచనల పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీల్లో సుమారు 250 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.
ఈ పోటీలలో గెలుపొందిన 50 మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సాహితీవేత్త సాకం నాగరాజ, అసోసియట్ ప్రొఫెసర్ చంద్ర గారు, పౌర చైతన్య వేదిక అధ్యక్షులు వాకా ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వర రావు గారు, ఏ.ఐ.డి.ఎస్.ఓ మాజీ రాష్ట్ర నాయకులు ఏ.హరీష్ పాల్గొని ప్రసంగించారు.
సాకం నాగరాజ గారు మాట్లాడుతూ భగత్ సింగ్ అసమాన దేశ భక్తుడని, విద్యార్థులందరూ దేశ భక్తి భావాలను పెంపొందించుకున్నపుడే దేశానికీ ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని అన్నారు.ప్రొఫెసర్ చంద్రా గారు మాట్లాడుతూ భగత్ సింగ్ గొప్ప పుస్తక ప్రియుడు,త్యాగధనుడని ఈ తరం విద్యార్థులు భగత్ సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.
పౌర చైతన్య వేదిక అధ్యక్షులు వాకా ప్రసాద్ గారు మాట్లాడుతూ సమాజంలో ఇతరుల పట్ల ప్రేమ, సేవా భావంతో మెలగాలని, రక్త దానం ప్రాణం దానం అని పేర్కొంటు వంద పర్యాయాలకు పైగా రక్త దానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వున్నానని చెప్పారు.
AIDSo మాజీ రాష్ట్ర నాయకులు ఏ. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులు అశ్లీల, క్రైమ్ సినిమాల హీరోలను కాదు భగత్ సింగ్, నేతాజీ, అల్లూరీ, అజాద్ వంటి అమరవీరులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బ్రిటిష్ వారి విభజించు పాలించువిధానంతోనే నేడు కూడా ప్రజలను కుల, మతాలుగా విడదీస్తున్న నేటి పాలకులను ప్రశ్నించే తత్వం విద్యార్థులకువుండాలన్నారు. పౌర చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఏ.ఎన్.పరమేశ్వర రావు గారు విజేతలకు వ్యక్తిత్వవికాస పుస్తకాలనుబహుమతి ప్రదానం చేశారు
ఈ కార్యక్రమానికి AIDSO నగర అధ్యక్షులు నవీన్ అధ్యక్షత వహించారు.
కార్యదర్శి ఉన్నతి సింగ్, తేజశ్రీ, తులసి, మోక్షజ్ఞ, ప్రవీణ, అరవింద్, వెంకట సుబ్బయ్య, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.