అల్లూరి సీతారామరాజుకు తిరుపతి విద్యార్థుల నివాళి

నేటి సమాజంలో అన్యాయం, దోపిడీ, అక్రమాలకు పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించడమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అన్న విద్యార్థులు

By :  Admin
Update: 2024-07-04 07:33 GMT


ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్  (ఏ.ఐ.డీ.ఎస్.ఓ ) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తారకరామ స్టేడియంలో పిల్లలు, పెద్దలు, వాకర్స్ అందరూ మన్యం విప్లవ వీరుడు అమరవీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఐ.యస్.ఇ.సి (ఆల్ ఇండియా సేవ్ ఎడుకేషన్ కమిటి) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఏ.హరీష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల దోపిడీకి, అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాన్ని నిర్వహించిన అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలను నేటి యువతరం అలవరుచుకోవాలనీ అన్నారు.




 దేశ ప్రజల కన్నీళ్లను తుడవడం కోసం ప్రాణాలను, కుటుంబాన్ని స్వాతంత్రం కోసం అర్పించారని, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫ ఖుల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్, మాస్టర్ దా సూర్యసేన్ వంటి గొప్ప మహనీయులు రాజీలేని పోరాటం ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు.

అనంతరం పరిపాలించిన మన దేశ పాలకుల విధానాల వలన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ నిరుద్యోగం, పేదరికం, విద్య వైద్య రంగాల వ్యాపారీకరణ, మహిళలపై నేరాలు, రైతుల ఆత్మహత్యలు, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని చెప్పారు. ఆ మహనీయుల త్యాగాలు బూడిద పాలయ్యానని వాపోయారు.

నేటి సమాజంలో అన్యాయం, దోపిడీ, అక్రమాలకు పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించడమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అని అన్నారు.

తిరుపతి నగర ఉపాధ్యక్షులు ఎన్.నవీన్ మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు, యువకులు సినిమా హీరోలను, హీరోయిన్లను, క్రికెట్ స్టార్లను, ప్యాషన్ డిజైనర్లను ఆదర్శంగా తీసుకొని నీచ సంస్కృతికి బలౌతూ, నీతి నైతిక విలువలు లేని వారిగా తయారవుతున్నారని,

గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను, సంఘసంస్కర్తలను, కవులను, రచయితలను, శాస్త్రవేతలను ఆదర్శంగా తీసుకోవాలనీ కోరారు. అందుకై దేశవ్యాప్తంగా ఏ.ఐ.డి.యస్.ఓ విద్యార్థి సంఘం గొప్ప మహనీయుల ఆదర్శభావాలను జీవిత చరిత్రలు వారి యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మహేష్, అజయ్, అమీన, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు.

Tags:    

Similar News