భావించిన ఓ తల్లి పుట్టిన ఆడశిశువును ఇసుకలో సగం వరకు సమాధి చేసింది. కొన్ని గంటల తరువాత వీధులు శుభ్రం చేయడానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు ఇసుకలో ఓ బిడ్డ కాళ్లు పైకి తేలి ఉండడం గమనించారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి ఆస్పత్రికి తరలించారు. తల్లి కాదనుకున్న బిడ్డను వైద్య శాఖలోని మహిళా సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. ప్రాథమికి చికిత్స చేసిన తరువాత, మెరుగైన చికిత్స అందించడం ద్వారా శిశువు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా తాపత్రయపడ్డారు.
తిరుపతి జిల్లా వరదాయపాలెంలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటనలో.. వైద్య శాఖ సిబ్బంది తమ కర్తవ్యాన్ని చాటుకున్నారు. శత్రుకైనా సేవలు అందిచడం వారికి ఉన్న గొప్ప లక్షణం. తమ సహచర సిబ్బందితో పాపను మెరుగైన చికిత్స అందించడానికి ఎలా స్పందించారో.. జాగ్రత్తలు చెప్పారో చూడండి.
Full View
ఆ ఆడ పసికందును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తిరుపతి జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. ఈ చర్యలతో మహిళా వైద్య సిబ్బంది తల్లి కాదంటే, వైద్య శాఖ సిబ్బంది మాతృప్రేమ కూడా ప్రదర్శించారు.
తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడబిడ్డ. బొడ్డు కూడా ఊడలేదు. ఆ పురుటిబిడ్డను ఓ తల్లి సజీవంగానే ఇసుకలో పూడ్చివేసింది. కొన్ని గంటల తరువాత పారిశుద్ధ్య కార్మికురాలు గమనించారు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఆడబిడ్డను కాపాడారు. ఇసుకలో పూడ్చి ఎన్నిగంటలు అయిందో తెలియదు. ఆ గట్టిపిండం కొనఊపిరితోనే ఉంది. ఆ ఆడ పసికందును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తిరుపతి జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
Full View
ఇసుకలో సజీవసమాధి నుంచి వెలుపలికి తీసిన ఆడ పసికందును సూళ్లూరుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ బిడ్డను పాకాడడానికి వరదాయపాలెం పీహెచ్సీ మహిళా వైద్య సిబ్బంది తాపత్రయపడ్డారు. ప్రత్యేక చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించడంలో కూడా అంతే శ్రద్ధ తీసుకున్నారు.
జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవరగలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్నట్లు కలెక్టర్ వి. వెంకటేశ్వర్ గుర్తించారు. వెయ్యి మంది మగపిల్లలకు ఆడపిల్లల సంఖ్య 629 మంది మాత్రమే పురుడు పోసుకుంటున్న వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని కొన్ని రోజుల కిందట ఆదేశించారు. అయినా భ్రూణ హత్యలు ఆగడం లేదనే విషయం మరోసారి వెలుగు చూసింది.
గుర్తుతెలియని ఓ మహిళ పరిస్థితి ఏమిటో తెలియదు. ఎక్కడ పురుడుపోసుకుందో తెలియదు. పుట్టిన ఆడబిడ్డను సజీవంగానే సమాధి చేయడానికి సాహసించింది. అంటే, ఆ తల్లి వేదన ఏమిటనేది ఆమెకే తెలియాలి. బొడ్డు కూడా ఊడని ఆడ పసికందును వదలించుకోవడానికి సాహసించడం ఆమె ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందనేది దేవుడికే తెలియాలి. ఆ కారణాలు ఏమిటో తెలియకున్నా.. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదాయపాలెం మండలంలో సోమవారం వెలుగు చూసిన ఘటన అనేక ప్రశ్నలు తెరమీదకు తెచ్చింది.
ఏమి జరిగింది?
తిరుపతి జిల్లా వరదాయపాలెం మండల కేంద్రంలోని ఓ ఫ్యాన్సీ స్టోర్ వద్ద గుర్తుతెలియని మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి ఏమిటో కానీ, పుట్టిన ఆడబిడ్డ ఆమెకు భారంగా మారినట్టు కనిపిస్తోంది. ఆ ఫ్యాన్సీ స్టోర్ కు సమీపంలోనే ఉన్న ఇసుకలో ఆ పసికందును బోర్లా పూడ్చివేసి వెళ్లిపోయినట్లు అక్కడి మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందింది.
ఎలా గుర్తించారు?
వరదాయపాలెంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులు వీధులు శుభ్రం చేయడానికి వెళ్లారు. రోడ్డు పక్కనే ఇసుకలో ఓ పసిబిడ్డ ఇసుక తిన్నెలపై నుంచి కాళ్లు కనిపిస్తుండడం, సమీపంలోనే కుక్కలు సంచరిస్తుండడం గమనించారు. సందేహంతో సమీపానికి వెళ్లే సరికి ఓ పసికందును పూడ్చారనే విషయం గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గట్టిపిండమే..
వరదాయపాలెంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుకలో పూడ్చిన నెలలు కూడా నిండని ఆడబిడ్డను వెలుపలికి తీశారు. అప్పటికీ కొన ఊపిరితో ఉండడం గమనించి, ఆశ్చర్యపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎన్ని గంటలకు ఆ బిడ్డను గుర్తుతెలియని ఆ తల్లి పూడ్చిందో తెలియదు కానీ, బిడ్డ సజీవంగా ఉండడంతో పోలీసులు కూడా మానవత్వంతో స్పందించారు. ఆడ పసికందును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
సొంతబిడ్డలా...
ఓ తల్లి వేదనకు అనాథగా మారిన ఆడ పసికందును వైద్య శాఖ సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. వరదాయపాలెంలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత వైద్య సిబ్బంది మెరుగైన చికిత్స కోసం సూళ్లూరుపేట ఏరియా ఆష్పత్రికి తరలించారు. అంబులెన్స్ లోకి బిడ్డను తీసుకుని బయలుదేరే ముందు ఆశ వర్కర్, మరో నర్సను ఉద్దేశించి వరదాయపాలెం మహిళా సిబ్బంది చెప్పిన జాగ్రత్తలు ఎలా ఉన్నాయంటే..
"అక్కా పాప జాగ్రత్త. గుర్తు తెలియని బిడ్డగానే నమోదు చేశా. స్టెరైల్ వాటర్ వాడమని చెప్పు, వెళ్లగానే ముందు ఆక్సిజన్ పెట్టించు. అక్కడ ఏమి చెప్పారో నాకు ఫోన్ కాల్ చేసి వివరించు" అని ఓ స్టాఫ్ నర్సు చెబుతున్న మాటల, అక్కడి రోగులను ఆశ్చర్యపరిాచాయి. బిడ్డ ఎవరిదైనా కావచ్చ. తల్లి మనసు ఎలా ఉంటుందనేది ఆమె స్వరంలో వినిపించిన అతృత ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి.