తిరుపతి (Breaking):పోటెత్తిన జనసైనికుల అభిమానం

తిరుపతి నగరం జనసైనికులతో నిండిపోయింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాలన్నీ జనసంద్రమయ్యాయి.

Update: 2024-10-03 12:29 GMT


Heading

Content Area

తిరుపతిలో డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి సభకు అభిమానులు, పార్టీ శ్రేణులు పోటెత్తారు. వారాహి డిక్లరేషన్- 2024 ప్రకటించడానికి గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నారు.

జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన గురువారం కూడా సాగుతోంది. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో 11 రోజుల ప్రాయశ్చిత్త విరమణ చేసిన ఆయన తిరుపతిలో గురువారం సాయంత్రం వారాహి సభ నిర్వహణకు కన్య ఏర్పాటు చేశారు. ఇంకొంత సేపట్లో సభ ప్రారంభం కానుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాక కోసం అభిమానులు కేరింతలు కొడుతున్నారు.

వారాహి సభ నిర్వహణ కోసం ఎంపిక చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పూలే విగ్రహం వద్ద అభిమాన శ్రేణులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.. ఉమ్మడి చిత్తూరు నుంచే కాకుండా రాయలసీమ జిల్లాలలోని జనసేన పార్టీ నాయకులు శ్రేణులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుపతి నగరం పవన్ కళ్యాణ్ అభిమానులతో పోటెత్తింది.

వారాహి వాహనం ఆగడానికి ఏర్పాటు చేశారు. ఆ వాహనానికి ముందు సుమారు ఒక పది మీటర్లు నోమెన్ జోన్గా ఉం చారు. దీంతో వారాహి వాహనం వైపునకు దూసుకుని రాకుండా, పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నారు. జనసేన జెండాలో చేత పట్టిన జనసైనికులు అందరూ పవన్ కళ్యాణ్ రాక కోసం నిరీక్షిస్తున్నారు. తిరుపతి యూనివర్సిటీ రోడ్డు నుంచి.. గాంధీ రోడ్డు వరకు మొత్తం అభిమాన శ్రేణులతో కిక్కిరిసింది.


Tags:    

Similar News