తిరుమల : బ్రహ్మోత్సవాల భద్రతపై దృష్టి... ఎంతమంది పోలీసులో తెలుసా... !

తిరుమల శ్రీవారి బ్రహ్మెత్సవాలకు అసాధరణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పోలీసులను రప్పించనున్నారు.

Update: 2024-10-01 14:28 GMT

రుమల శ్రేవేంకటేశ్వరస్వామి బ్రహ్మత్సవాలకు ఈ నెల నాల్గవ తేదీ అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ నెల రోజుల నుంచి ఏర్పాట్లలో ఉంది. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా అనేక వసతులపై దృష్టి సారించింది. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రకులకు కూడా ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తోంది. వారి భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులను కూడా బందోబస్తు విధుల్లో నియమించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. టీటీడీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు తోడుగా పోలీస్ శాఖ కూడా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండే రీతిలో భద్రతపై కన్నేసింది.


తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గోకులం సమావేశ మందిరంలో సమీక్ష సమీక్షించారు. మంగళవారం ఆయన తిరుమల కొండపై టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగంతో పాటతు లా అండ్ ఆర్డర్ అధికారులతో సమీక్షించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముషిబాజ్ పాయ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు., టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి అదనపు ఎస్పీ వెంకటరావు (పరిపాలన), తిరుమల అదపు ఎస్పీ రామకృష్ణ ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, టీటీడీ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం..


డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో 5,145 మందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారికి ఈ నెల నాల్గవ తేదీ సీఎం ఎన్. చంద్రబాబు పట్టుస్త్రాలు సమర్పించడానికి రానున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మొదటి విడతలో 3,881 మందితో బందోబస్తు కల్పిస్తాం. వారందరూ బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు సేవలందిస్తారు. ఈ నెల ఎనిమిదో తేదీ వేంకటేశ్వరస్వామివారి గరుడ సేవ జరగుతుంది. ఆ రోజు అదనంగా 1,264 మందితో బందోబస్తు ఉంటుంది. అని వివరించారు. గరుడోత్సవానికి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మందికి పైగానే వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
1. గరుడసేవ రోజు తిరుమలకు ద్విచక్ర వాహనాలు అనుమతించరు.
2. తిరుమలో వాహనాల పార్కింగ్కు 24 స్థలాలు గుర్తించారు. 8000 వేల వాహనాలు నిలపడానికి వీలుగా ఏర్పాట్లు చేశాం.
3. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తిరుపతిలో ఐదు ప్రాంతాలు ఎంపిక చేశారు.
4. ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అలిపిరి బస్టాండ్, పాత చెక్ పాయింట్, వినాయక నగర్ గ్రౌండ్ (ఇస్కాన్ గ్రౌండ్), నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
5. గరుడసేవ రోజు ట్రాఫిక్ ఎక్కువైతే.. తిరుపతి నగర శివారుల్లోయ ఐదు హాల్లింగ్ పాయింట్లు గుర్తించారు. అక్కడ వాహనాలు పార్కింగ్ చేసే వారు తిరుమలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడానికి ఏర్పాట్లు
6. గరుడ సేవ రోజున టూరిస్ట్ బస్సులు, టెంపో ట్రావెల్ వాహనాలు జూ పార్క్ రోడ్ లోని దేవలోక్ పార్కింగ్ ప్రాంతాన్ని.. ఫోర్ వీలర్ లకు భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ లో క్యూఆర్ కోడ్ సహాయంతో పార్కింగ్ చేయాలి.
నిఘా నేత్రం
1. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అనుమానితులపై డేగ కన్ను వేశారు. ఇందుకోసం తిరుమలలో మాత్రమే 2,700 సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. నేరాల నియంత్రణ, క్రైంపార్టీ సిబ్బంది ఏర్పాటు చేశారు.
2. సైబర్ క్రైం పోలీసులతో సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంది. అసత్య ప్రచారాలు, వదంతులు వైరల్ కాకుండా చర్యలు.
3. తిరుమలలో అక్కడక్కడా సబ్ కంట్రోల్ పాయింట్లు
4. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా వారి చేతిక జియో ట్యాగింగ్ ఏర్పాటు
మాడవీధుల్లో

తిరుమల నాలుగు మాడవీధుల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు వద్ద ఎలాంటి తొక్కిసలాట జరగకుండా రోప్ పార్టీ పోలీసులతో పటిష్ట చర్యలు.
"అన్ని శాఖలను సమన్వయంతో బ్రహ్మోత్సవాల విజయవంతానికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేశాం " అని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఈసారి పోలీస్, టీటీడీ విజిలెన్స్ వారు సమిష్టిగా సంసిద్ధం. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.


"ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి గ్యాలరీలలోకి భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి క్యూలోకి అనుమతిస్తాం" అని తెలిపారు. " తిరుమలలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక బాలాజీ నగర్ వాసులు, అతిథి గృహాలు, మఠాలు, షాపులు యజమానులు సహకరించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు.
Tags:    

Similar News