Tiruchanuru | పద్మావతీ అమ్మవారి పంచమీ తీర్థానికి వస్తున్నారా..

ఈ సమాచారం మీ కోసమే.. తిరుచానూరులో 25వ తేదీ చక్రస్నానంతో ముగియనున్న బ్రహ్మెత్సవాలు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-23 05:42 GMT
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం సమీపంలోని పుష్కరిణి

శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం పంచమీతీర్ధం (చక్రస్నానం)

ఈ నెల 25వ తేదీ (మంగళవారం) జరుగుతుంది. ఆరోజు కోనేరులో పుణ్యస్నానాలు చేయడానికి యాత్రికులు పోటెత్తనున్నారు. రద్దీ నియంత్రణ ( Crowd control )కు టీటీడీ, తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి (కోనేరులో) చక్రతాళ్వారుకు చక్రస్నానం నిర్వహించడం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
పాఠం నేర్పిన తొక్కిసలాట
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన సంఘటన టీటీడీ యంత్రాంగానికి ఓ పాఠం నేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు అంటే చక్రస్నానం జరిగే సమయంలో స్థానికులే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి యాత్రికులు పోటెత్తుతారు.
తిరుచానూరు పద్మ పుష్కరిణిలో..
టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణకు భద్రతా చర్యలపై వివరిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
తిరుమల తరహాలోనే తిరుచానూరు (Tiruchanur) శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం సమీపంలోని పద్మ పుష్కరిణి (Padma Pushkarini) లో పుణ్య స్నానాలు చేయడానికి యాత్రికులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తిరుచానూరులో గుర్తించిన హోల్టిండ్ పాయింట్లలో టీటీడీ ( Tirumala Tirupati Devasthanams TTD) యాత్రికులకు రుచికరమైన అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. తోపులాటకు ఆస్కారం లేకుండా బారికేడ్లు, పోలీసు బృందాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లు (Drones) ఏర్పాటుకు తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఈ సూత్రాలు పాటిస్తే,
"చక్రస్నానం జరిగి సమయంలో పుష్కరిణిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కష్టాలకు చోటు ఉండదు. తోపులాటకు ఆస్కారం లేకుండా పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి. వీరబ్రహ్మం, సీవీఎస్ఓ ( TTD Chief Vigilance and Security Officer) కేవి. మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సూచించారు.
పుష్కరిణికి నాలుగు మార్గాలు...
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి సమీపంలోని పుష్కరిణి వద్దకు వెళ్లడానికి నాలుగు వైపులా మార్గాలు ఉన్నాయి. పుష్కరిణి పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను రెండు విభాగాలుగా వేరు చేశారు. ఆ ప్రత్యేక మార్గాల్లో రద్దీ నియంత్రణకు అదనపు ట్రాఫిక్ సిబ్బంది, కోనేరు నాలుగు వైపులా ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు.
ఐదు హోల్డింగ్ పాయింట్లు..
పుష్కరిణిలోని వెళ్లడానికి ఉన్న నాలుగు మార్గాలకు ముందే టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు ఐదు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రద్దీ నియంత్రణ కోసం భారీగా తరలి వచ్చే యాత్రికులను ఆ పాయింట్లలో కంట్రోల్ చేయడం ద్వారా పుష్కరిణి వద్ద తోపులాటకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ వివరించారు.
1. నవజీవన్ కంటి ఆసుపత్రి పక్కన
2. జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం
3. పూడి రోడ్డు
4. తోళ్లప్ప గార్డెన్
5. పద్మావతీ అమ్మవారి ఆలయం సమీపంలోని గేట్ నెంబర్- 4
"హోల్డింగ్ పాయింట్ల వద్ద ప్రతి బృందంలో ఒక ఆర్ఐ (Reserve Police Inspector) సాధ్వర్యంలో 15 మంది సిబ్బందిని నియమించాం. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ ఉంటుంది" అని తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెప్పారు. దీనికోసం ప్రతి హోల్డింగ్ పాయింట్ వద్ద అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు బాధ్యతలు అప్పగించామని ఆయన చెప్పారు. రోప్ పార్టీలు, అత్యవసర పరిస్థితి ఏర్పడితే మెడికల్ టీంలు, ఫస్ట్ ఎయిడ్ సేవలు, అంబులెన్స్ లు 24/7 సిద్ధంగా ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.
"హోల్డింగ్ పాయింట్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్‌ ( Command Control)కు అనుసంధానం చేశారు. అదనంగా డ్రోన్ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. లైవ్ ఫీడ్ ఆధారంగా అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా దిద్దుబాటు చేయడానికి చర్యలు చేపట్టాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వివరించారు.
అన్నప్రసాదాల పంపిణీ..
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రముఖమైన పంచమి తీర్థానికి వచ్చే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు వేచి ఉండే ఆ ఐదు హోల్డింగ్ పాయింట్ల వద్ద ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
"యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశాం. అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశాం" అని టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం తెలిపారు.
"24వ తేదీ సాయంత్రం నుంచి ఐదు హోల్డింగ్ పాయింట్లలో సుండలు, బిసిబేలె బాత్, పులిహోర, రాత్రి ఉప్మా, బాదంపాలు, బిస్కెట్ ప్యాకెట్లు" అందివ్వడానికి టీటీడీ సిబ్బంది తోపాటుశ్రీవారి సేవకులు కూడాఅందుబాటులో ఉంచుతున్నామని జేఈఓ వీరబ్రంహ్మం వివరించారు.
కీలక ఘట్టం: బ్రహ్మోత్సవాల ముగింపులో కీలక ఘట్టం పంచమీ తీర్థం (చక్రస్నానం) జరిగే 25వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచి కూడా యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ప్రత్యేకంగా రవ్వ కేసరి అందిస్తుంది. దీంతోపాటు బాదం పాలు , బిస్కెట్, పొంగలి, ఉప్మా, మధ్యాహ్నం బిసిబేలె బాత్, పెరుగన్నం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు శ్రీవారి సేవకుల సహకారంతో అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు జేఈఓ వీరబ్రహ్మం వివరించారు.
పుష్కరిణిపై నిఘా..

పుష్కరిణి వద్ద గజ ఈతగాళ్లు (Swimmers) నిరంతరం అందుబాటులో ఉండే విధంగా నిఘా ఉంచారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ట్రాఫిక్, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, SDRF–NDRF బృందాలు, కమాండ్ కంట్రోల్ విభాగం సమన్వయం చేసుకుని విధులు నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయడం ద్వారా సిబ్బందికి పని విభజన చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కే.వి. మురళీకృష్ణ మీడియాకు చెప్పారు.
Tags:    

Similar News