Tragedy | అన్నమయ్య జిల్లా:మరో విషాదం మిగిల్చిన విహారయాత్ర

రాజంపేట చెయ్యేరు ఊబిలో చిక్కుకుని ముగ్గురు ఎంబీఏ విద్యార్థుల మృతి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-21 17:48 GMT
అన్నమయ్య జిల్లాలో నీట మునిగి మరణించిన విద్యార్థులు

రాయలసీమలో 24 గంటలు తిరగకుండానే మరో విషాదం చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా రాజంపేట వద్ద సమీపంలోని అన్నమయ్య ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చెయ్యేరు నదిలో ఈత వెళ్లి, ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారంతా కడప జిల్లాలోని మూడు ప్రాంతాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
చెయ్యేరు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, ఎగువన ఉన్న పింఛా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. నీటిలో ఈత కొడుతున్న ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఊబిలో చిక్కుకొని మరణించారు. ఐదుగురు విద్యార్థులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో ఇంజినీరింగ్ కాలేజీ తో పాటు కడప జిల్లాలో మూడు కుటుంబాలు తీవ్ర విషాదం ఏర్పడింది.

బాలరాజుపల్లె చెయ్యేరు నది వద్ద రాజంపేట ఏస్పీపీ రామనాథ్ హెగ్డే

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద ఆరుగురు 5వ తరగతి విద్యార్థులు ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలకు కోల్పోయారు. ఈ సంఘటన మరిచిపోక ముందే, రాజంపేట వద్ద మరో విషాదం చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు రాయచోటి మార్గంలో ఉన్న బాలరాజు పల్లి సమీపంలోని రెండు వైపులా విస్తరించిన శేషాచలం కొండల మధ్యలో ప్రవహించే చెయ్యేరు నది వద్దకు వెళ్లారు. విద్యార్థులు గురువారం మధ్యాహ్నం తమ వెంట తీసుకుని వెళ్లిన భోజనాలు పూర్తి చేశారు. ఐదుగురు విద్యార్థుల ఇసుక తిన్నెలపై ఆడుకుంటున్నారు. వారిని ఆటపట్టిస్తూ, మరో ముగ్గరు విద్యార్థులు నీటిలో ఈతకు దిగారు. వాతావరణం కాసేపు సరదానే సాగింది.
ఆహ్లాదంలో.. ఆందోళన
చెయ్యరు నదిలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో వారందరూ భోజనాలు చేశారు. ఐదుగురు విద్యార్థులు ఇసుకలో సరదాగా ఆడుకుంటున్నారూ. మరో ముగ్గురు విద్యార్థులు నదిలో ఈతకు దిగారు. కొద్దిసేపటికి నీళ్లలో ఈత కొడుతున్న యువకుల నుంచి హాహాకారాలు వినిపించడంతో ఒడ్డున ఉన్న మిగతా విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈతకు దిగి, ఊబిలో చిక్కుకున్న విద్యార్థుల రక్షించడానికి ఏమి చేయాలనేది దిక్కతోచని స్థితిలో ఒడ్డుపై ఉన్న మిగతా ఐదుగురు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది.
చెయ్యేరు నదిలో చిక్కుకుని మరణించిన విద్యార్థులు ముగ్గురు రాజంపేట సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులను గుర్తించారు. వారిలో రాజంపేట మండలం గాలివారిపల్లి కు చెందిన సోంబత్తిన దిలీప్(22), ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి కు చెందిన కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22), పొరుమామిళ్లకు చెందిన పీనరోతు కేశవ (22) గా గుర్తించారు.
పనిచేయని హెచ్చరికలు
కర్నూలు జిల్లా అస్పరి వద్ద జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
"వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో నీటి కుంటల వద్దకు వెళ్లకండి. జాగ్రత్తలు పాటించండి" అని జిల్లా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
రాయలసీమలో ఇటీవల కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెయ్యేరు నదిలో నీటి ప్రవాహం ఓ మోస్తరుగా ఉంది. అదే సమయంలో రాయచోటి ఎగువ ప్రాంతంలో ఉన్న పింఛ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో చెయ్యరు నదిలో నీటి ఉధృతి పెరిగినట్టు తెలుస్తోంది. రాజంపేట వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన సంఘటన నేపథ్యంలో యువకులు జాగ్రత్తలు పాటించలేదని విషయం మరోసారి వెలుగుచూసింది. ఆహ్లాదం కోసం వెళ్లిని ఎనిమిది మంది ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల రంగ ప్రవేశం

ప్రమాదం నుంచి బయటపడిన ఏంబీఏ విద్యార్థులు

రాజంపేట మండలం బాలరాజు పల్లె వద్ద చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థులు మరణించారనే సమాచారం అందిన వెంటనే రాజంపేట ఏఎస్పీ రామనాథ్ హెగ్డే ఘటన స్థలానికి సిబ్బందితో చేరుకున్నారు. ఊబిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. వారి వెంట వెళ్లిన మరో ఐదుగురు విద్యార్థులను రాజంపేట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మరణించిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను రాజంపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై రాజంపేట రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News