ఒకే సమయంలో మూడు రోడ్డు ప్రమాదాలు..ఐదుగురు మృతి
ఒక ప్రమాదం మరో రెండు యాక్సిడెంట్లకు కారణమైంది. వీటికి లారీలే కారణం.;
By : The Federal
Update: 2025-05-04 06:00 GMT
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకే సమయంలో మూడు ఘోరమైన రోడ్డు ప్రదాలు చోటు చేసుకున్నాయి. ఈ దుర్ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్లున్న లారీ బోల్తా పడింది. బోల్తాపడిన లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఆగి ఉన్న ఒక కారును వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ వరుస ప్రమాదాల్లో ఐదురుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గుంటూరు, నెల్లూరు వాసులుగా గుర్తించారు.
కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఒంగోలు మండలం కొప్పోలుకు దగ్గరలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడుకు చెందిన వారుగా గుర్తించారు. 60 ఏళ్ల రమణయ్య, 45 ఏళ్ల బాబు, 25 ఏళ్ల నాగేంద్రలు ఈ ప్రమాదంలో మరణించారు.
బోల్తా పడిన కోడిగుడ్ల లారీని వేగంతో వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘటనలతో రోడ్డుపైన వాహనాలన్నీ ఆగిపోయాయి. అలా ట్రాఫిక్‌లో ఆగిపోయిన ఓ కారును వెనుక నుంచి వేగంతో వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల పావని, 14 ఏళ్ల కౌశిల్ మరణించారు. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారు ప్రమాదంలో మరణించిన మృతులు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.