ఓ ఇంట విషాదం మిగిల్చిన దసరా ఏర్పాట్లు..

ఆటోను లారీ ఢొనడంతో పత్తికొండ వద్ద ముగ్గురి మృతి

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-30 13:03 GMT

దసరా పండుగకు సరుకులు కొనుక్కోవాలని వచ్చిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. సరుకులు కొనుక్కన్న తరువాత ఆటోలో బయలుదేరిన వారిని అదుపుతప్పిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు వదిలారు. వారిలో తల్లీ, ఐదేళ్ల కూతురుతో పాటు, మరో మహిళ కూడా ఉన్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం జరిగింది. పండుగకు ముందు రోజే ఆ కుటుంబంలోనే కాదు. గ్రామంలో విషాదం నింపింది.


తుగ్గిలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), కూతురు నితిక (5) తోపాటు శిరీష (30) తో కలిసి పత్తికొండలో సరుకులు కొనుక్కోవడానికి వచ్చారు. పనులు పూర్తి చేసుకున్న భూమిక తన కూతురు నితికతో పాటు శీరీషతో కలిసి షేరింగ్ ఆటో ఎక్కింది.

ఆనందంగా మాట్లాడుకుంటూ ముకెల గ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ అదుపు తప్పి, ఆటోను ఢీకొంది. దీంతో వారిముగ్గురు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇంకొందరు కూడా గయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.తీవ్రంగా గాయపడిన వారిని పత్తికొండ ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News