ఇదండీ మన అంకెల కథ! ఆ రోమన్ అంకెలేమయ్యాయో, ఏమో!!
అంకెల పురాణం కూడా పెద్దదే. సున్నా (0)ని మనం కనిపెట్టడానికి పూర్వం పెద్ద కథే నడిచింది. సులువుగా ఉన్నవే శాశ్వతమని నిరూపితమైంది. అయితే గతాన్ని మరువకూడదు కదా..
By : The Federal
Update: 2024-10-09 01:38 GMT
భాషలన్ని రకాలు కాకపోయినా అంకెల్లోనూ చాలారకాలు ఉన్నాయి. అత్యధిక శాతం ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న అంకెలను (మనతో సహా )- ఇండో అరబిక్ అంకెలు (Numerics) అంటారు.
ఇవి ఒకటి నుంచి తొమ్మిది ఆ తర్వాత సున్న ఉంటుంది. ఇదిగో ఇలా - 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 & 0 . వీటి వాడకం సులువు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్నాయి. సున్నా కనిపెట్టిన ఘనత కూడా మనదే.
మన తెలుగు భాషలానే , తెలుగు అంకెలున్నాయి. వాటిని గుర్తించగల చదువరులు ఇప్పుడు నూటికి పది శాతం కూడా ఉండరు . కారణం అలవాటు చెయ్యకపోవటమే అని నా భావన. ఇదిగో అవి ఇలా ఉంటాయి. ఇప్పుడు గూగుల్ తెలుగులో టైపు చేసేటపుడు ఇవే వస్తుంటాయి. (౧,౨,౩,౪,౫,౬,౭,౮,౯,& ౦ ) వీటిని కూడ ఇండో అరబిక్ అంకెలలానే ఉపయోగించవచ్చు.
ఇకపోతే కొంత పరిచయమున్న లాటిన్/ రోమన్ అంకెలు. గతంలో స్కూళ్లలోనూ లెక్కల మాస్టారు చెప్పేవారు. బోర్డుపై రాసి చూపించేవారు. వాటిని మనలో చాలమందికి వీటి వాడకం ఒకటి నుంచి యాభై లోపే తెలుసు. అవి ఇలా ఉంటాయి. I , II , III , IV, V, VI, VII, VIII, IX, X - వీటిలో సున్న లేదు. ఇరవై సంఖ్య రాయాలంటే రెండు పది అంకెలు XX రాయాలి -
ఈ విధానంలో ..
1 - I
2 - II
3- III
4- IV
5 - V
6 - VI
7- VII
8- VIII
9- IX
10 - X
50 - L
100 - C
500 - D
1000 - M
ఈ పై అంకెలతోనే కావలసిన సంఖ్యలు తయారుచేసుకోవాలి-
ఉదాహరణకు :
2 - II , 3 - III - నాలుగును ఐదు అంకెకు ముందు ఒకటి అంకెను వేస్తారు, 4 - IV , 5 నుంచి 8 వరకు V పక్కన I, II, III చేర్చుతూ పోతారు. 9 కి పది (X) కి ముందు ఒకటి చేర్చుతారు IX -
39 రాయాలంటే X+X+X+ IX = 39
50 అంకెను L అని రాస్తారు. 40 అంకెను రాయాలంటే 10 - 50 ( యాభై అంకెకు ముందు రాసిన అంకెను అందులోనుంచి తీసి వేయాలి ) అంటే 40 ఐనట్లు . XL = 40
45 = 40 లోనుంచి 10 తీసి 5 కలపాలి =
XLV = 45 అలానే 69 కి 50 కి 10 + 9 కలపాలి =
LXIX = 69
100 ki C , 500 కి D, 1000 కి M - వీటితో కావలసిన అన్ని సంఖ్యలు తయారుచేసుకోవాలి .
501 = DI - D 500 + I 1 = 501
575 కి 500+50+10+10+5 ను D + L + X + X + V = DLXXV ఇలారాయాలి
చివరకు 940 ఎలా రాయాలో చెప్పుకుని చాలిద్దాం ఈనాటికి - 1000 - 100 + 40 = CMXL
ఇంత సరళం.. సారీ గరళంగా ఉన్నాయి కనుకనే ఇవి ఉనికిలో లేకుండాపోయి ఉంటాయి - సులువైనవి వచ్చేంత వరకూ ఇవే గతి అయ్యి ఉండి ఉంటాయి.
పాతరోజుల్లో బట్టల షాపుల్లో కోడ్ అంకెల్లా వీటినో , తెలుగు అంకెల్నో రాసేవారు - ఆకాలం వాళ్ళకు గుర్తుండే ఉంటుంది - బట్టల తానును చుట్టిన అట్టకు ఓ గుడ్డ లేబుల్ బీద రాసిన అంకెలు చూసి ధరచేప్పేవాళ్ళు సేల్సుమెన్లు కానీ యజమానులు కానీ - అవి కొనేవాళ్ళకర్ధమయ్యేవి కావు -
ఎవరికీ అర్ధం కాని వ్యవహారంలా తయారవబట్టే - ఇలా కనుమరుగైనవి -
ఐనప్పుడు వీటి గురించి తెలుసుకోవడమెందుకని మిత్రులెవరైనా ప్రశ్నించవచ్చు -
దానికి నా జవాబు : శ్రీ శ్రీ గారి వువాచ.. 'క్లాసిక్సు చదవండర్రా కవిత్వం ఎలా రాయగూడదో తెలుస్తుంది'
నమస్తే 🙏🏽
(గొర్రెపాటి రమేష్ చంద్ర బాబు)