ట్రెజరీకే కన్నం.. ఏమి చోరీ చేశారంటే..?

ఓ ఉద్యోగి ఖజానాకే కన్నం వేశాడు. ఇంతకీ అక్కడ ఏమి చోరీ జరిగింది? నలుగురు ఎందుకు సస్పెండ్ అయ్యారు?

Update: 2024-10-07 15:50 GMT

అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీలో ఇంటిదొంగలే చేతివాటం ప్రదర్శించారు. నగదుతో పాటు పురాతన నాణేలు కూడా చోరీ చేశారు. ఈ ఘటనలో నలుగురు సస్పెండ్ అయ్యారు. చోరీపై సబ్ డివిజనల్ ట్రెజరీ అధికారి అమీరుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు నలుగురిపై జిల్లా ట్రెజరీ అధికారి శివశంకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్, అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

ఈ చోరీ ఘటనను రాజంపేట పట్టణ పోలీసులు ఛేదించారు. ట్రెజరీలో చోరీ ఘటనపై సీఐ యల్లంరాజుతో కలిసి డీఎస్పీ సుధాకర్ ఆ వివరాలు వెల్లడించారు. రాజంపేట డివిజన్ ట్రెజరీ కార్యాలయంలో అటెండర్ వెంకాల విష్ణువర్థనరెడ్డి చోరీకి పాల్పడినట్టు విచారణలో నిర్ధారించి, అరెస్టు చేసినట్లు డీఎస్పీ సుధాకర్ సోమవారి మీడియాకు వెల్లడించారు.

చోరీ ఎలా పొక్కింది..
రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా,య గుప్తనిధి బయటపడింది. అందులో నుంచి పురాతన నాణేలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ వాటిని స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించారు. తరువాత రాజంపేట ట్రెజరీలో డిపాజిట్ చేశారు. ఇదిలావుంటే, మరో కేసులో ఇదే నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 12 వేలు కూడా ట్రెజరీలో డిపాజిట్ చేశారు. ఆ నగదు కోసం ఓబులవారిపల్లె పోలీసులు ట్రెజరీ అధికారిని సంప్రదించడంతో ఆ సొమ్ముతో పాటు పురాతన నాణేలు గల్లంతైన విషయం వెలుగు చూసింది.
అటెండర్ అరెస్టు
ఈ చోరీ ఘటనలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్, అటెండర్ విష్ణువర్ధనరెడ్డిఅనుమానితులుగా ఉన్నప్పటికీ ప్రధాన సూత్రదారి అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డి అని డీస్పీ సుధాకర్ వెల్లడించారు. అతనిని విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. తమ విచారణలో
"నన్ను సబ్ ట్రెజరీ ఆఫీసర్ పీ.రమేష్ రెడ్డి, సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాషా అవమానకరంగా మాట్లాడేవారు. "రమేష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఈ చర్యకు పాల్పడ్డాను" అని నిందితుడు విష్ణువర్ధనరెడ్డి అంగీకరించడంతో, ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్ వివరించారు.
ఎలా బయటపడింది..
"గత నెల 13వ తేదీ మధ్యాహ్నం ఎస్టీఓ, ఏటీఓ స్ర్టాంగ్ రూమ్ తాళాలు తెరిచారు. ఆ సమయంలో లోనికివెళ్లి చెక్క బీరువాలోని రూ.12 వేలు నగదు, సీల్ చేసి, అట్టపెట్టెలో ఉన్న 20.800 గ్రాముల బంగారు నాణేలు చోరీ చేసి ఇంట్లో దాచుకున్నా" అని నిందితుడు విష్ణువర్ధనరెడ్డి అంగీకరించాడని డీఎస్సీ వివరించారు.
సెప్టెంబర్ 21: ట్రెజరీలో డిపాజిట్ చేసిన రూ.12 వేలు ఇవ్వమని ఓబులవారిపల్లె పోలీసులు సీనియర్ అకౌంటెంట్ సాదక్ బాషాను అడగడంతో ఈ చోరీ బయటపడిందని వివరించారు.
సెప్టెంబర్ 30: తేదీ దీనిపై జిల్లా ట్రెజరీ, అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ మహబూబ్ ఫిర్యాదు చేశారు. సీఐ కే. యల్లమరాజు, ఎస్ఐలు వీ. నాగేశ్వరరావు, వీఎల్. ప్రసాద్ రెడ్డి, సిబ్బందితో ఒక టీం ఏర్పాటు చేశామన్నారు. విధులకు గైర్హాజరవుతుండడంతో సందేహించి, అటెండర్ విష్ణువర్థనరెడ్డిపై నిఘా ఉంచామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
పాత నాణేలు స్వాధీనం

కడప నగరం ఎర్రముక్కపల్లెలో నివాసం ఉంటున్న విష్ణువర్థనరెడ్డి ఇంట్లో తనిఖీ చేశామని డీఎస్పీ తెలిపారు. ట్రెజరీలో చోరీకి గురైన 78 పురాత నాణేలు, జత పోగులు (చెవి రింగులు), రెండు కొక్కిలు, డైమండ్ షఫర్ స్వార్స్ 9, మొర్రగుండ్లు 4, మొత్తం బరువు 20.800 గ్రాములు ఉందన్నారు. అలాగే రూ.12 వేలు తన సొంత ఖర్చుకు వాడుకున్నట్లు విచారణలో విష్ణువర్ధనరెడ్డి అంగీకరించారన్నారు. ఈ కేసును త్వరగాన చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారన్నారు.
Tags:    

Similar News