పులివెందులలో అనూహ్య పరిణామాలు

రీపోలింగ్ బహిష్కరించిన వైసిపి;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-13 05:07 GMT


కడప జిల్లా పులివెందులలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జెడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం నడిచింది. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది.
పులివెందులలో మంగళవారం పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి.
పులివెందులలోని 3, 14 పోలింగ్ కేంద్రాలు అచ్చివెల్లి, ఈ. కొత్తపల్లిలో బుధవారం ఉదయం నుంచి రీపోలింగ్ జరపాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ రీపోలింగ్ ను బహిష్కరించింది.
కడప ఎంపీ వైఎస్. అవానాష్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
"ఈ కేంద్రాల్లో పోలింగ్ బహిష్కరిస్తున్నాం. కేంద్ర బలగాల రక్షణలోనే 15 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ పోలింగ్ నిర్వహించాలి" అని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, ఆ రెండు పోలెంగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం నుంచే టీడీపీ మద్దతుదారులు మాత్రం ఆ కేంద్రాల వద్ద ఓట్లు వేయడానికి బారులుదీరారు.
వైసీపీ నేతలు ఏమంటున్నారు..
"పులివెందుల జెడ్పిటిసి పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో టిడిపి మద్దతుదారులకు పోలీసులు ఏకపక్షంగా అండగా నిలిచారు" అని వైసిపి ఆరోపించింది. అందువల్ల అన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు మంగళవారం ఉదయం పోలింగ్ జరిగింది. ఈ రెండు కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా కలియ తిరుగుతూ, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని వైసీపీ ఆరోపించింది. ఆ మేరకు మంగళవారం జరిగిన పోలింగ్ తీరుపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (state election commission SEC) కి ఫిర్యాదు చేసింది.
కడప జిల్లా కలెక్టర్ నుంచి అన్ని వివరాలు తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహిని వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. పులివెందులలో మూడో పోలింగ్ కేంద్రం అచ్చివెళ్లి, 14వ పోలింగ్ కేంద్రం ఈ కొత్తపల్లిలో రీపోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ బహిష్కరణ
పులివెందులలో వైసీపీ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన మహేష్ రెడ్డి తో పాటు ఆ గ్రామంలోని ఓటర్లు కూడా వారి హక్కును వినియోగించుకోకుండా ఇళ్ళ నుంచి బయటకు రానివ్వలేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సంఘం వాస్తవ పరిస్థితి తెలుసుకొని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ రాష్ట్ర నాయకులు తో పాటు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
పులివెందులలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్ వైసిపి బహిష్కరించింది. పులివెందుల జడ్పిటిసి పరిధిలోని 15 కేంద్రాల్లో మళ్లీ రీపోలింగ్ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేసింది.
Tags:    

Similar News