వైస్ వివేకా హత్య కేసు..తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా?
హత్య కేసు దర్యాప్తుపై సీబీఐని నిర్దేశించిన సుప్రీంకోర్టు..వైస్ సునీత,ఆమె భర్తపై కేసులను క్వాష్ చేస్తామన్న ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మళ్లీ కొనసాగుతుందా..దర్యాప్తు ముగిసిందని చెప్పిన సీబీఐ తదపరి దర్యాప్తు తిరిగి ప్రారంభిస్తుందా.. ఇవే అనుమానాలు ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈకేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని సీబీఐని నిర్దేశించింది. దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాలో వద్దో కూడా చెప్పాలని పేర్కొంది. ఎంత మంది నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న విషయాన్నీ చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరి ఇప్పుడు సీబీ కోర్టుకు ఏమి చెబుతుందన్నది ఆసక్తిగా మారింది.మరోవైపు కోర్టు, వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని వెల్లడించింది. చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.