భారతీయ సాహిత్యంలో ‘తెలుగు కథ’ వైవిధ్య పాత్ర పోషించిందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 75 ఏళ్ల తెలుగు కథ అంశంపై సదస్సు కర్నూలు నగరంలోని లలిత కళా సమితిలో ఆదివారం ఉదయం నిర్వహించారు. సభను ప్రారంభించిన ఆయన సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 నుంచి 2022 వరకు తెలుగు చిన్న కథలలో అనేక మార్పులు, పరిణామాలు వచ్చాయని, ఇవి సమాజాన్ని తీవ్ర ప్రభావితం చేశాయన్నారు.
సభకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర మాట్లాడుతూ సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా భాషా సాహిత్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని, తొలి అధ్యక్షులుగా నెహ్రూ పనిచేశారని గుర్తు చేశారు. సాహిత్య అకాడమీకి రాజకీయ అతీతమైన భావజాలం ఉందని అన్నారు. ప్రగతిశీల విప్లవ కథలు అంశంపై కే నాగేశ్వరావు చారి మాట్లాడుతూ.. సీరియస్ రచయితల కథలు తెలుగు కథ నేల విడిచి సాము చేయలేదని, పత్రిక కథలు మినహా కరుణకుమార కథలు జాతీయ ఉద్యమం సామాజిక చైతన్యం తెలంగాణ ఎర్రజెండా గంగినేని వెంకటేశ్వరరావు మూడు సంపుటాలు విప్లవోద్యమం నిర్వచనాలన్నారు. కథలు కాలాన్ని బట్టి మారుతాయని, త్రిపురనేని మధుసూదనరావు కథ ఫోటోగ్రఫీలా ఉండాలని సూచించారు.
మైనార్టీ కథలపై ఇనాయతుల్లా మాట్లాడుతూ.. మైనార్టీల పేదరికం, వివక్ష, హిందూ దాష్టికం వల్ల కథలు విస్తృతం అయ్యాయని అన్నారు. నాయకుల పాచికలు, షేక్ హుస్సేన్ సత్యాగ్ని ఖబ్బారాకోతి స్కైబాబా కోస్తా రాయలసీమ తెలంగాణ మైనార్టీ వాద కథలు, షాజహాన మసీద్ పావురం దాదా హయత్ కథలు మైనార్టీ సాహిత్యంలో మైలురాళ్ళని అన్నారు. బహుజన దళిత గిరిజన కథలుపై జి వెంకటకృష్ణ మాట్లాడుతూ.. కథ కావ్యం పురాణాల్లో, వేదాల్లో, నవలల్లో ఉంటుందని, కథానిక మాత్రం ఒక చిన్న విషయం మేలుకొలుపు మధ్యతరగతి ప్రజల ఆలోచనలను పంచుకోవడం కోసం వచ్చిందన్నారు. దళిత కథానిక కారంచేడు, చుండూరు వేంపెంట, 1990 తర్వాతనే ఈ వాదాల కథలు వచ్చాయన్నారు. బిఎస్సి కాశీరాం అంబేద్కర్ ఎవరి గురించి వారు చెప్పుకునే కథ 1990 తర్వాత మొదలైందన్నారు.
దళిత డిప్రెషన్ క్లాస్, అంబేద్కర్ దళితుల కంటే బీసీలు సమాజంలో ఎక్కువ శ్రమ దోపిడీకి గురయ్యారన్నారు. నారాయణస్వామి బిఎస్ రాములు కథల్లో అవమానం, అనుభవం చెప్పాల్సిన విషయాలు ఒక వృత్తంలో వలయాలు ఏర్పరచడం వంటివి సృష్టించారని అన్నారు. 144 బీసీ కులాలు తెలంగాణ పొలం రాజు కథ, ఇలాంటివి దళిత కథలు శ్రీపాద, గిరిజన కథ మళ్లీపురం జగదీష్ ఎరుకలు కథ పలమనేరు బాలాజీ తెలుగు కథ నేల విడిచి సామ చేయలేదన్నారు.
మారుతి పౌరుహితం మాట్లాడుతూ ప్రాంతీయ తెలుగు కథ అస్తిత్వం ప్రధానం కథ అని, అస్తిత్వవాద కథలు, కళింగాంధ్ర రాయలసీమ, తెలంగాణ అట్టాడ అప్పలనాయుడు ఆశారని తెలుగు సాహిత్యంలో ఇవి ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు. ప్రసంగించిన నలుగురు వ్యక్తులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ ప్రారంభించగా వందన సమర్పణను సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంద్యాల రఘుబాబు చేశారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఆవుల బసవప్ప, జిల్లా నాయకులు యన్. నాగమణి, పులిచేరి మహేశ్ కుమార్, డా. సక్కిరి భాస్కర్, విజయులు తనగల, ఓంకార్, మధు బాలగౌని, పి.చంద్రయ్య, కవులు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, కళ్యాణదుర్గం స్వర్ణలత, డా. దండబోయిన పార్వతీదేవి, ఎస్ డీ వీ అజీజ్, రత్నం ఏసేపు, ఏ వి రెడ్డి , మధుసూదన శర్మ, తదితరులు పాల్గొన్నారు.