17 నుంచి బెంగళూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు

ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 16న అంకురార్పణ;

Update: 2025-09-11 11:54 GMT

బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు 16వ తేదీ మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.

పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8.30 గం.లకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 10.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 06.30 గం.లకు పవిత్ర ప్రతిష్ట చేపడుతారు.సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం స్నపన తిరుమంజనం, తదుపరి పవిత్ర సమర్పణ, కుంభ ప్రదక్షిణ, ఆచార్య బహుమానం, ఆశీర్వచనం తదితర వైదిక కార్యక్రమాలతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనాలని భావించే దంపతులు రూ.1,000/- టికెట్‌ కొనుగోలు చేసి పాల్గొనవచ్చని, గృహస్తులకు ఒక ఉత్తరియం, ఒక రవికె, ఒక లడ్డూ, వడ, ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.పవిత్రోత్సవాల కారణంగా సెప్టెంబ‌రు 19న‌ అభిషేకం (ఏకాంతం), సెప్టెంబ‌రు 20న క‌ల్యాణోత్స‌వం ఆర్జిత‌ సేవల‌ను టిటిడి రద్దు చేసింది.

Similar News