విజన్ డాక్యుమెంట్‌పై కలెక్టర్లకు సీఎం ఏమి క్లారిటీ ఇస్తారు
బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు.;
విజన్ డాక్యుమెంట్ పై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఏమి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌కు తెరతీసింది. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లకు చంద్రబాబు ఇచ్చినంత ప్రాధాన్యత గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఐదేళ్ల సమయంలో ఒకే ఒక సారి కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌ను నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో నిర్వహించారు. అది కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నిర్మించిన ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును నిర్వహించిన జగన్.. ప్రజావేదిక అక్రమ కట్టడమని, కాన్పెరెన్స్ పూర్తి అయిన తర్వాత దానిని కూల్చివేయాలని ఆదేశించారు. తర్వాత దానిని పడగొట్టి విమర్శలు మూటగట్టుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లు లేకుండా పోయాయి.