రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు..ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన లోకేష్‌

మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.;

By :  Admin
Update: 2025-03-16 14:26 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పదో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మండే ఎండల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 0:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ మేరకు యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 5,64,064 మంది ఇంగ్లీషు మీడియంలోను, 51,069 మంది తెలుగు మీడియంలోను పరీక్షలు రాయనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌ వంటి జరక్కుండా, పరీక్షలు సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన లోకేష్‌..
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు, అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నీరు, సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విజయీభవ.. అంటూ మంత్రి నారా లోకేష్‌ పదో తరగతి విద్యార్థులకు తన ఆశీస్సులను తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పక్రటించింది. ఆయా ప్రాంతాల నుంచి పరీక్షల కేంద్రాలకు వెళ్లేందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంది. పల్లె వెలుగుతో పాటు అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను చూపించి బసుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
Tags:    

Similar News