పీ4పై ఆందోళనలకు సిద్ధమైన ఉపాధ్యాయులు
దాదాపు 18 డిమాండ్లతో ఫ్యాప్టో ధర్నా నోటీసులను ప్రభుత్వానికి సమర్పించారు.;
By : The Federal
Update: 2025-07-28 13:36 GMT
పీ4 పథకాన్ని ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దడంపై ఉపాధ్యాయులు నిరసనలకు దిగేందుకు సిద్ధమయ్యారు. మొదట ఆగష్టు 2 వ తేదీన జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఆగష్టు 12 వ తేదీన రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపును ఇచారు. ఈలోపు ఫ్యాప్టో నాయకత్వంతో చర్చించి ఆందోళన కార్యక్రమాన్ని నివారించే భాద్యత ప్రభుత్వం వహించాలని కోరిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
డిమాండ్లు ఇవే..
1. పి–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు.
2. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
3. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి.
4. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మద్యంతర భృతి(ఐఆర్)ని ప్రకటించాలి.
5. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎనాక్యాష్మెంట్ ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి.
6. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 03 పెండింగ్ డీఏలను ప్రకటించాలి. డీఏ బకాయిలను, 11వ పీఆర్సీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
7. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 01 తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నం:57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోనికి తీసుకుని రావాలి.
8. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. 72, 73, 74 జీవోలు అమలు చేయాలి.
9. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి.
10. హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యధాతధంగా కొనసాగించాలి.
11. అసంబద్ధంగా వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా డీఈఓ ను తక్షణమే విధుల నుండి తొలగించాలి.
12. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
13. ఇంకా పదవీకాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను ( ఎస్ జి.ఎఫ్ ) సెక్రెటరీలను తొలగించడం సరైనది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి.
14. అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి.
15. సూపర్ న్యూమరి పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పి.ఈ.టి.లకు పదోన్నతులు కల్పించాలి.
16. మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలి.
17. ఈహెచ్‌ఎస్/ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి.
18. మండల విద్యా శాఖాధికారుల బదిలీలలో చేపట్టాలి.