Student burned alive | ప్రేమించక పోతే ఇంతేనా?
ప్రేమించలేదని విద్యార్థినిపై పెట్రోల్ పోసి సజీవ దహనం;
By : SSV Bhaskar Rao
Update: 2024-12-09 04:49 GMT
ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం కడప జిల్లా వేములలో ఓ యువతి కత్తిపోట్లకు గురైంది. అంతకుముందు బద్వేలులో ఓ విద్యార్థినిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ సంఘటనలు మరువక ముందే..
కర్నూల్ లో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన విషాద ఘటన ఇది. సోమవారం పొద్దున వెలుగులోకి వచ్చింది.
ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ ఇంటర్ విద్యార్థిని పట్టించుకోలేదు. ఇంట్లో వారికి చెప్పడంతో ఆ బాలుడిని అనేకసార్లు మందలించారు. దీంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి నిద్రిస్తున్న విద్యార్థిని పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.
ఉమ్మడి కర్నూలు జిల్లా (ప్రస్తుతం నంద్యాల జిల్లా) నందికొట్కూరులోని బైరెడ్డినగర్ లో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. మంటల్లో చిక్కుకున్న బాలిక ఆర్తనాదాలు ఆ కాలనీ మొత్తం ప్రతిధ్వనించాయి. మంటల్లో చిక్కుకున్న ఆ బాలిక ఆ వ్యక్తిని కూడా పట్టు పట్టుకుంది. దీంతో అతను కూడా గాయపడ్డారు.
ఈ సంఘటన పూర్వపరాల్లోకి వెళితే,
నంద్యాల జిల్లా వెల్దుర్తి మండలానికి చెందిన ఓ విద్యార్థిని తండ్రి కొంతకాలం కిందట మరణించాడు. దీంతో నందికొట్కూరులోని అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్న ఆ విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. కాగా ఈ బాలికను కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి ప్రేమతో వెంటపడ్డాడు. దీనిని తిరస్కరించిన ఆమె అంతటితో ఊరుకోకుండా అమ్మమ్మ తాతయ్య తో పాటు సమీప బంధువులకు ఈ విషయం చెప్పింది. అతనిని అనేకసార్తు మందలించారు. దీంతో ఆగ్రహించిన రాఘవేంద్ర ఆ విద్యార్థినిపై పగ పెంచుకున్నాడు.
ఆ తర్వాత కూడా అనేకసార్లు ఆ బాలిక వెంటపడి వేధించాడని తెలిసింది. ఇదిలా ఉండగా
ఆదివారం అర్ధరాత్రి అమ్మమ్మ ఇంటిలో నిద్రిస్తున్న బాలిక గదిలోకి రాఘవేంద్ర పెట్రోల్ సీసాతో వెళ్లాడని చెబుతున్నారు. నిద్రిస్తున్న బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఎగసిన మంటలు, బాధ భరించలేని ఆ విద్యార్థిని చావుకేకలు పెడుతూ రాఘవేంద్రను కూడా గట్టిగా పట్టుకోవడంతో అతను కూడా గాయ పడ్డాడు.
బాలిక కేకలతో ఇంట్లో వారు మేలుకోవడం, చుట్టుపక్కల వారు కూడా రావడంతో అన్ని ఎందుకు పట్టుకున్నారు. మంటల్లో ఓ కాలిపోయిన బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించిన ప్రజలను లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించింది. ఈ సమాచారం అందుకున్న నందికొట్కూరు పోలీసులు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి, తాను కూడా గాయపడిన రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న రాఘవేంద్రను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.