కట్టుదిట్టమైన ఏర్పాట్లు..8న ప్రధాని మోదీ రాక
విశాఖ రైల్వేజోన్ కార్యాలయానికి శంకుస్థాపనతో పాటు మరి కొన్నింటికి వర్చువల్‌గా శంకుస్థాపనలు చేయానున్నారు.;
జనవరి 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ఆ మేరకు శుక్రవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లు, భద్రత చర్యల మీద సమీక్షించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా చూడాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ కార్యక్రమం ఖరారై రావాల్సి ఉందన్నారు.