పాత బస్తీలో 'కొత్త దేవత', బీజేపీ కోర్కెలు తీర్చేనా!
పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ చార్మినార్ చెంత ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం దర్శనానికి బారులు తీరుతున్నారు. ఎందుకంత హడావిడి... వివరాలు
హైదరాబాద్ పాత నగరంలోని చార్మినార్ మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం విశేషమయినది.
కొత్త దేవాలయాలు వస్తుంటాయి. కొత్త ఉత్సవాలు జరుగుతుంటాయి. కాని, కొత్త దేవతలు పుట్టుకురావడం జరగదు. ఎందుకంటే, దేవతలు ఆద్యంతాలు లేని వాళ్లు. వాళ్ల పేరుతో గుళ్లు గోపురాలు నిర్మాణమవుతుంటాయి. వీటికి ఆసక్తికరమయిన స్థలపురాణం ఉంటుంది.అది ఇప్పటి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అయితే, హైదరాబాద్ లోని పాత బస్తీలో ఒక కొత్త దేవత వెలిశారు.
ఆమ్మవారి పేరు భాగ్య లక్ష్మి.ఆమె పేరుతో చార్మినార్ పక్కనే గుడి కట్టారు. ఈ గుడికి యాభై అరవై సంత్సరాలకంటే ఎక్కువ చరిత్ర ఉండదు. ఆలయం ఉనికిలోకి ఎలా వచ్చినా, ఇపుడది ఒక వర్గానికి రాజకీయాాలయంగా మారింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పాతబస్లీలో ఉండటం, దానికి తోడు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎఐఎంఐఎం అభ్యర్థి అసదుద్డీన్ ఒవైసీని ఓడించాలనే ధ్యేయం ఉండటంతో ఈ గుడి భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ జీరో అయింది. గుడి చుట్టూ భక్తి భావం కంటే రాజకీయ సందడే ఎక్కువ ఉంటుంది.... ఈ వాతావారణం మీద ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక కథనం
కిటకిట లాడుతోంది
భాగ్యలక్ష్మి ఆలయం రాజకీయ నాయకుల ప్రదక్షిణలతో కిటకిటలాడుతోంది. సాధారణ భక్తులే కాకుండా రాజకీయ నేతల కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారిగా పేరుంది. దీంతో వివిధ పక్షాల నేతలు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు.
2020 జీహెచ్ఎంసీ ఎన్నికలు...2020 డిసెంబరులో జరిగిన కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థుల ఖరారు తర్వాత అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఎన్నికల్లో గెలవాలని మొక్కుకున్నారు. అప్పట్లో భాగ్యలక్ష్మీ దేవాలయం కేంద్రంగానే రాజకీయాలు సాగాయి. అప్పట్లో వరద సాయం నిలిపివేతకు బీజేపీనే కారణమని టీఆర్ఎస్ ఆరోపించడంతో తాను ఈసీకి లేఖ రాయలేదని బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. కేసీఆర్ ను కూడా దేవాలయానికి రావాలని బండి సవాలు విసిరారు. ఆ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు రావడంతో బండి సంజయ్ కార్పొరేటర్లతో కలిసి దేవాలయానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు.
2024 డిసెంబరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే ముందు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశాకే వెళ్లారు.
2024 డిసెంబరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే ముందు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశాకే వెళ్లారు.