ఏపీలో టెంపుల్ టూరిజానికి అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం ప్రారంభం కానుంది. త్వరలోనే దీనికి శ్రీకారం చుట్టాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయించారు.

Update: 2024-10-19 11:59 GMT

ప్రస్తుతం ఏపీలో టెంపుల్ టూరిజం పెద్దగా లేదు. ఎవరైనా దేవాలయాలకు వెళ్లాలంటే వేరు వేరుగా వెళ్లి వస్తున్నారు. టూరిస్ట్ బస్ ల ద్వారా ఒక వైపు నుంచి బయలుదేరి రాష్ట్రమంతా చుట్టి వచ్చే పరిస్థితులు లేవు. ఒక వైపు నుంచి వెళితే తిరిగి అదే ప్రదేశం నుంచి మరో ప్రదేశం వైపుకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి స్వస్తి చెబుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ టూరిస్ట్ బస్ లు తీసుకుని దేవాలయాల దర్శనం కోసం దేవదాయ శాఖ టెంపుల్ టూరిజం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమైన ఏడు దేవాలయాలకు టూరిస్ట్ బస్ ల ద్వారా భక్తులు వచ్చే విధంగా చర్యలు తీసుకో నుంది. భక్తుల బస్ లు ఎటువైపు వెళుతున్నాయి అనే వివరాలు కూడా తెలుసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు దేవదాయ శాఖ తెలుసుకుంటుంది.

రాయలసీమకు సంబంధించి టూరిస్ట్ బస్ లను కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమలకు నడుపుతారు. ఈ బస్ ల్లో తగిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే అన్నవరం, సింహాచలం, అరసవల్లి, ద్వారకాతిరుమల, మోపిదేవి, విజయవాడ, మంగళగిరి, శ్రీశైలం దేవాలయాలకు ఒకరూట్ చేసి టూరిస్ట్ బస్ లు నడుపుతారు.

Delete Edit

దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం ఓంకార నాథం వినిపిస్తుంది. ఉదాహరణకు శ్రీశైలంలో ఓం నమశ్శివాయ, తిరుమలలో ఓం నమో వెంకటేశాయ, విజయవాడలో ఓం కనక దుర్గాయ అంటూ ఓంకార నాదాలు వీనుల విందుగా వినిపిస్తుంటాయి. ఏరోజు కారోజు కొత్తగా దేవాలయాలను భక్తుల సందర్శనార్థం పరిశుభ్రంగా ఉంచుతారు. దేవాలయం లోపలి భాగంలో ఎక్కడైనా కూర్చుని కాసేపు మనశ్శాంతి కోరుకునే విధంగా బండలపై కానీ, నేలపై కానీ దుమ్ము, చెత్త వంటివి లేకుండా క్లీన్ గా ఉంచుతారు. ఎంతటి పరిశుభ్రత అంటే అక్కడ ఏదైనా తినుబండారాలు పడినా తీసుకుని తినే విధంగా పరిసరాలు ఉంచేందుకు దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల భద్రత, భక్తులకు సౌకర్యాలు, దేవాలయాల్లో సిబ్బంది విధి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. దేవాలయాల్లో అన్ని వైపుల కెమెరాలు ఉండటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే గుర్తించేందుకు వీలు ఉంటుందని మంత్రి భావించారు. దేవాలయాల్లోకి భక్తులు అడుగు పెట్టగానే ఆథ్యాత్మిక చింతన కలగాలనేది మంత్రి ఆలోచన. కమాండ్ కంట్రోల్ రూము నుంచి సీసీ కెమెరాల ద్వారా దేవాలయాల్లో జరుగుతున్న అన్ని వివరాలు తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూముకు దేవాలయాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తారు.

Delete Edit

దేవాలయాలను ఆదాయాన్ని బట్టి ఏబిసిడీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ పరిధిలోకి శ్రీకాళహస్తి, కాణిపాకం, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ దేవాలయాలు వస్తాయి. ఇలా రూ. 50 వేల నుంచి రూ. 2లక్షల వరకు ఆదాయం వచ్చే దేవాలయాలను ఒక కేటగిరీ కింద కేటగిరీలుగా విభజించారు. మొత్తం ప్రధాన మైన ఆదాయం వచ్చే దేవాలయాలు 27 ఉన్నాయి.

టెంపుల్ టూరిజం కింద వెళ్లే బస్ ల్లో అదే దారిలో వచ్చే మిగిలిన ఆథ్యాత్మిక కట్టడాలు, ఎంటర్ టైన్ మెంట్ ప్రదేశాలు, అహ్లాద కరమైన వాతావరణం ఉండే ప్రదేశాలను కూడా చూపించేందుకు దేవదాయ శాఖ ప్రణాళికలు తయారు చేస్తోంది.

Tags:    

Similar News