శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
ఈ నెల 23న ఉత్సవాలకు అంకురార్పణ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-16 13:01 GMT
శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్–2025ను తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశంలో విడుదల చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ రాత్రి పెదశేషవాహనంతో ప్రారంభంకానున్నాయి.
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు బుక్ లె్ విడుదల చేశారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జరుగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడవాహనం, అక్టోబర్ 2న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
భక్తులకు మరింత సేవ
టీటీడీ ఈఓగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టిటిడి పాలక మండలి శుభాకాంక్షలు తెలిపింది. అన్నమయ్య భవన్ లో బోర్డు మీటింగ్ తరువాత ఈఓ సింఘాల్ కు చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు, శ్రీవారి జ్ణాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ,
"గతంలో ఈఓగా పనిచేసిన అనుభవ యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతోంది" అని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, అధికారుల సహకారంతో సమష్టిగా పనిచేద్దామని ఆయన కోారు. బోర్డు సలహాలు, సహాకారంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని ఈవో సింఘాల్ తెలిపారు.