శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కావాలా..?
రేపు ఉదయం డిసెంబర్ కోటా విడుదల.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-17 13:04 GMT
తిరుమల శ్రీవారి దర్శనానికి డిసెంబర్ నెల కోటా ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 18వ తేదీ (గురువారం) ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయన్నారు. రేపు టికెట్లు బుక్ చేసుకునే వారికి డిసెంబర్ నెలలో రోజూ వారి దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది.
తిరుమలలో అంగప్రదక్షిణ, వసతి, వర్చువల్ సేవా టికెట్లు, శ్రీవాణి తోపాటు వృద్ధుల దర్శనం కోటా షెడ్యూలును టీటీడీ వెల్లడించింది. ఆ వివరాలు ఇవి.
ఆర్జిత సేవా టికెట్లు
1. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
2. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
3. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు.
ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే యాత్రికులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ స్టష్పం చేసింది.
సేవా టికెట్లు: ఈ నెల 22వ తేదీ టీటీడీ ఆన్ లైన్ లోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను కూడా విడుదల చేయనుంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
వర్చువల్ సేవ: ఈ నెల 22వ తేదీ యాత్రికుల కోసం వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి దర్శనం కోటా
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అమలు చేస్తున్న శ్రీవాణి దర్శనం డిసెంబర్ నెల కోటా టికెట్లు కూడా విడుదల చేయనున్నారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల కోటా
శ్రీవారి దర్శనానికి గతానికి భిన్నంగా టీటీడీ వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించే కోటా టికెట్లను కూడా ఆన్ లైన్ కోటా విధించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం డిసెంబర్ నెల కోటా టికెట్లు 24వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు.
గదుల కోటా: యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి గదుల కోటా కూడా టీటీడీ ఆన లైన్ లో విడుదల చేస్తోంది. తిరుమల తోపాటు తిరుపతిలో కూడా వసతి టీటీడీ గదుల కోసం సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.