Tirumala| రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఫిబ్రవరి కోటా టికెట్లు రేపు (గురువారం) విడుదల చేస్తారు.

Update: 2024-11-20 06:42 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి తీవ్ర రద్దీ ఉంది. అన్నివర్గాల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ (TTD) ఆన్ లైన్ కోటా ఆర్జిత సేవా టికెట్లు గురువారం ఉదయం విడుదల చేయనుంది. టీటీడీ చీఫ్ పీఆర్ఓ రవి ఈ విషయం తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉంచడానికి వీలుగా ఆన్ లైన్ లో ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో పూర్తి పారదర్శత కోసమే టీటీడీ ఈ విధానం అమలులోకి తెచ్చిందన్నారు. అందరికీ శ్రీవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ విధానం అమలులో ఉందన్నారు.

ఉదయం ౧౦ గంటలకు విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి మూడు నెలల ముందే ఆన్ లైన్ (ONLINE)లో టికెట్లు విడుదల చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తుల కోసం..
2025 ఫిబ్రవరి కోటా ఆర్జీత సేవా టికెట్లు ఈ నెల 21 (గురువారం) వ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిర్ధిష్ట సమయానికి ఆన్ లైన్లో కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేస్తారు.
23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు.
మ‌ధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను విడుదల.
24వ తేదీ ఉద‌యం 10 గంటలకు రూ. 300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ చీఫ్ పీఆర్ఓ రవి వివరించారు.
Tags:    

Similar News