శ్రీకాళహస్తి : పూజలు చేయ.. పూలు తెచ్చాను..

ముక్కంటి క్షేత్రం శుక్రవారం కిటకిటలాడింది. గౌరీవ్రతానికి మహిళలు పోటెత్తార. ఈ పూజల విశేషమేమిటంటే..

Update: 2024-11-01 10:24 GMT



శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో శుక్రవారం కేదారీగౌరీ వ్రతం నిర్వహించారు. ఆలయ సమపంలోని శ్రీకృష్ణదేవరాయ మండపంలో కేదారీగౌరీదేవికి పూజల అనంతనం నిర్వహించిన వృతానికి మహిళలు భారీగా హాజరయ్యారు. అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి, విశేష పూజలు చేశారు. ధూపదీప, నైవేద్యాలు సమర్పించిన అనంతరం దేవస్థానం వేద పండితులు శాస్త్రొత్తంగా కేదారీగౌరీవ్రతం పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.


శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి-విజయవాడ మార్గంలోనే ఉండడం వల్ల బస్సు, రైలు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఐదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్రచోళు-1, ఆ తరువాత చోళరాజులు, విజయనగుల పరిపాలనలో పూర్తి చేసిన ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ శైవక్షేత్రంలో లింగోద్భవ దర్శనానికి యాత్రికులు పోటెత్తుతారు. ఈ ఆలయం పంచభూత కేంద్రాల్లో ఒకటిగా వాయులింగంగా ప్రసిద్ధి, దీనికి వాయులింగ క్షేత్రం అని కూడా చెబుతారు. ఈ ఆలయానికి రాహు- కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పూజలు అందుకుంటోంది. ఇక్కడ రాహు కేతు పూజలు చేయించడానికి దేశం నుంచి కాకుండా, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇంతటి చారిత్రక శైవక్షేత్రంలో..


దీపావళి పండుగ తరువాత ఆలయంలో కేదారీదేవివ్రతం పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీపావళి పండుగ అవాస్య రోజు వస్తుంది. ఈ చీకటిని పారదోలి, వెలుగులు నింపాలని పూజలు నిర్వహిస్తారు. అమావాస్య ఘడియల్లో కేదారీదేవివ్రతం నిర్వహించడం ఆనవాయితీ. దీపావళిలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే అవామాస్య ఘడియలు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉం టాయని శ్రీకాళహస్త్రి దేవాలయ పండితులు తెలిపారు.

ఈ పూజలకు హాజరైన మహిళలు నోములు కూడా నోచుకుంటారు. ఈ పూజలకు హాజరైన మహిళలు ఐదు లేదా తొమ్మిది నోముదారాలు, పూలు, పండ్లు, అరిసెలు, గంధం, పసుపు, కుంకుమ, అగరుబత్తీలు, తమలపాకులు, వక్కలు ఓ పళ్లెంలో తీసుకుని వచ్చారు. అర్చకులు కేదారి గౌరీదేవికి పూజలు నిర్వహిస్తుండగా, మహిళలు కూడా సామూహికంగా మొక్కులు చెల్లించారు.

అనంతరం నోముదారాలు కట్టుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ పూజలను శ్రీకాళహస్తీశ్వరస్వామి (Sri kala Hasti )ఈఓ (Excutive Officer) ఎస్ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు, డిప్యూటీ ఈఓ ఎన్ఆర్. కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, సూపరింటెండెంట్ అండ్ సీఎస్ఓ నాగభూషణంయాదవ్, టెంపుల్ ఇనస్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు పర్యవేక్షించారు.



Tags:    

Similar News