ఆ మాటలే 'పేదల డాక్టర్'ను చేశాయంటున్న శ్రీధర్

విదేశాల్లో చదువు. విలాసవంతమైన జీవితం. ఇవన్నీ వదులుకున్నాడు. తండ్రి ఆశయం కోసం తమ్ముడి సహకారంతో పేదల డాక్టర్ అయ్యారు.

Update: 2024-11-15 09:52 GMT

జ్వరం వచ్చిన రోగికి నాడి చూడాలంటేనే కనీసం రూ. 200 ఫీజు తీసుకుని రోజులివి. కీళ్లనొప్పులు, ఆర్థోపెడిక్ (orthopaedic) డాక్టర్ వద్దకు వెళితే జేబు ఖాళీ అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది కాస్త ఖరీదైన వైద్యమే. అనంతపురంలో ఓ డాక్టర్ మాత్రం రూ. పదికే వైద్యం చేస్తున్నారు. తనకు ఎదురైన సంఘటన , తండ్రి ఆశయం డాక్టర్ కోనంకి శ్రీధర్ ను పేదల వైద్యుడిని చేసింది. సంపన్నులైనా సరే టోకెన్ తీసుకుని క్యూలో రావాల్సిందే.

వైద్య సేవలు అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో.. కేవలం రూ. 10కే డాక్టర్ కోనంకి శ్రీధర్ నాయుడు వైద్యం చేయడానికి దారి తీసిన పరిస్థితు లనుఆయన మాటల్లోనే విందాం..

అనంతపురం పట్టణంలో పుట్టి పెరిగిన నేను శ్రీవిద్యానికేతన్ స్కూల్ లో చదువుకున్న. బాపూజీ జూనియర్ కళాశాలలో బైసీపీ పాస్ అయ్యా. ఎంసెట్లో 372 ర్యాంకు రావడంతో అనంతపురం కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీలో మొదటి బ్యాచ్. గవర్నమెంట్ సీటు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుకున్న. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి న్యూజిలాండ్ వెళ్లాను. అని డాక్టర్ శ్రీధర్ చెప్పారు.
ఆలోచనలో పడ్డా..
ఇవన్నీ చేసినప్పుడు కేవలం నా వ్యక్తిగతంగా నా వరకు ఉపయోగం ఉంది.. తప్పితే నేను పుట్టి పెరిగిన దానికి అర్థం లేకుండా పోతోందని తెలుసుకున్నా. నేను ఒక స్వయంసేవకుడిని నా తండ్రి వెంకటనాయుడు కాలం నుంచి నాకు అవి అలవాటు అయ్యాయి. ఆయన కూడా స్వయం సేవకుడు. మా కుటుంబం స్వయం సేవకులు. సంఘం స్వయం సేవక్ నేర్పించేది ఒకటే. ఆది కాలం నుంచి వేద కాలం నుంచి, పుణ్యకాలం వరకు మన పెద్దలు రంగరించి మేళవించి ఇచ్చినదే భారతీయత. భారతీయ సంస్కృతి. తల్లికి బిడ్డ దూరమైనప్పుడు తల్లి విలువ తెలుస్తుందనే విషయాన్ని నేను విదేశాల్లో ఉన్నప్పుడు గ్రహించాను.
తల్లికి బిడ్డ దూరమైన భావన
నేను పుట్టిన ఊరు ఎక్కడ నా తల్లిదండ్రులు ఉండేది ఎక్కడ? నా ఆత్మీయులు తిరుగుతుండేది ఎక్కడో. నేను మాత్రం విదేశీ గడ్డపైనే ఉన్నాను. ఇక్కడే చదువుకున్న ఇక్కడే పని చేస్తున్నా. ఈ జీవితానికి సార్ధకత దొరకదా అని మీమాంసలో పడ్డాను. అప్పుడే నాకు అర్థమైంది తల్లికి బిడ్డ దూరమైతే ఎంతగా తలడిల్లుతుందో.. నా దేశానికి నేను దూరంగా ఉన్నప్పుడు ఆ విలువ తెలిసింది. ఈ దేశం నుంచి అక్కడికి నేను చదువుకోడానికి వెళ్లాను. అక్కడి పరిస్థితులు జీవన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే. భారతదేశ జీవన విధానం గుర్తుకు వచ్చింది. అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో. మదిలో మెదిలింది. ఇవన్నీ నాకు చక్కగా తెలిసి రావడానికి ఒక అవకాశం కలిగింది. ఇవన్నీ తెలిసి వచ్చినా జీవితంలో ఒక అనుభవం అనేది అవసరం.
అదే జరిగింది...
ఊహించని సంఘటనలే జీవితాన్ని మలుపు తిప్పుతాయి. అప్పుడే జీవితం విలువ, బాధ్యత కర్తవ్యం గుర్తుకువస్తుంది. జీవితంలో 60, 70 ఏళ్లు వచ్చాక చేయడానికి ఏమీ ఉండదు అనే విషయాన్ని నేను గ్రహించాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వైద్య విద్య చదివాను. ఈ చదువు కోసం నా తండ్రి ప్రోత్సాహం అందించాడు. ఆయన కోరిక నెరవేర్చడానికి దాదాపు 8 ఏళ్ల పాటు నేను న్యూజిలాండ్ లో ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంలో నాకు ఒకటే అనిపించేది. తండ్రికి దూరంగా ఉన్నాను. ఆ భావన వ్యక్తీకరించడం కూడా సాధ్యం కాదు. ఆయన ఆశయ సాధనకు మెడిసిన్ ఒకటేసారి పాస్ అవుతూ వచ్చాను. విదేశాల్లో నేర్చుకున్న వైద్య విజ్ఞానాన్ని నా ప్రాంత ప్రజలకు వినియోగించాలని ఒక ఆలోచన వచ్చింది.
ఆ మాటలే కదిలించాయి..
విదేశాల్లో ఉన్న నేను నా తల్లిదండ్రులను చూడ్డానికి తిరిగి అనంతపురం వచ్చేసా. ఆ సమయంలోనే నాకు జరిగిన ఓ సంఘటనతో జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిందని డాక్టర్ కోణంకి శ్రీధర్ చెబుతున్నారు.
"2017 డిసెంబర్లో నేను నా తండ్రి బైక్ లో వెళ్తున్నాం. అదే సమయంలో స్నేహితుడు కనిపించడంలో మా నాయన అరే రా.. రా.. అని తన వెనక పక్క కూర్చోమన్నాడు. ముగ్గురం బైక్ లో బయలుదేరాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓ పప్పీ (puppy) అడ్డుగా వచ్చింది. ఆ వేగంగా ఉన్న నేను కాలు కింద పెట్టగానే బరువు తాళలేక విరిగిపోయింది. స్వతహాగా ఎముకల డాక్టర్ అయినా నాకు ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రధమ చికిత్స చేశారు. అప్పటికే నొప్పి బాధ తట్టుకోలేకున్నా. కళ్ళు తెరిచేసరికి నేను బెంగళూరు ఆసుపత్రిలో ఉన్న. మోచిప్ప 12 పీసులు అయింది.
ఇదేనా జీవితం..
అంబులెన్స్ కు కాల్ చేస్తే, గంటల కొద్దీ దిక్కులేదు. విదేశాల్లో నేను అన్ని విమానాలే కాదు. అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ లో కూడా ప్రయాణించా. అక్కడ మెడికల్ ఎయిర్ అంబులెన్సులు ఉన్నాయి. నాకు తగిలిన గాయం బాధ ఓ పక్క విదేశాల్లో నేను గడిపిని క్షణాలు గిర్రున కళ్లముందు రీళ్లు మాదిరి తిరుగుతుండగా, నన్ను ఆస్నత్రికి తరలించారు. లోకల్ అనస్థియా మాత్రమే ఇవ్వమన్నా. కానీ డాక్టర్లు నాకు ఫుల్ మత్తు ఇచ్చారు. కళ్లు తెరిచే సరికి నేను బెంగళూరు కొలంబియా ఆస్నత్రి బెడ్ పై ఉన్నా. ఇనుప రాడ్ వేయకుండానే నాకున్న అవగాహన మేరకు ఫారిన్ (forign) టెక్నాలజీతో సర్జరీ చేయించుకున్న. ఆ తర్వాత అనంతపురం తిరిగి వచ్చాం. పది నెలలపాటు మంచం పైనే ఉన్న. కిందికి దిగి తిరగడానికి ప్రత్యేకంగా వీల్ చైర్ డిజైన్ చేయించుకున్న. నా వైద్యమే నాకు పనిచేసింది. ధైర్యంగా కోలుకున్నా. పది నెలల తర్వాత నేను మంచం పైనుంచి కిందికి దిగాను" అని డాక్టర్ కోన శ్రీధర్ తన అనుభవాన్ని " ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్" ప్రతినిధితో పంచుకున్నారు.
మా నాయన మాట కదిలించింది..
నా కాలికి తగిలిన దెబ్బ నయమైంది. కాస్త కుదుటపడ్డాక బెడ్ మీద నుంచి దిగి కిందికి నడుస్తు, ఆ ఆనందాన్ని మా ఆయనతో పంచుకున్న. "నాన్న నేను నడుస్తున్నా" అని గట్టిగా కేక వేయగానే, ఆయన ఆనందపడ్డాడు. దగ్గరికి వచ్చి ఆ లింగం చేసుకున్నాడు. అదే సమయంలో మా నాయన చెప్పిన మాట నన్ను కదిలించింది.
"నువ్వు నడిస్తే ఉపయోగం లేదు రా. నీలాంటి వ్యక్తులు సమాజంలో చాలామంది నడవలేని స్థితిలో ఉన్నారు. వాళ్లకు నీ చదువు ఉపయోగపడితే నీ చదువుకు సార్ధకత ఉంటుంది" అని నా కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఆయన చెప్పడం. నేను పది నెలల తర్వాత మంచం పైనుంచి దిగా. ఈ రెండు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పేదలకు 10 రూపాయలకు వైద్యం చేస్తున్నా. అని తాను ఎంచుకున్న మార్గాన్ని వివరించారు.
నేను భూమి మీద ఉన్నంతవరకు, దేవుడు నాకు ఆయుష్షు ఉన్నంత వరకు ఈ పది రూపాయల వైద్యం కొనసాగుతుంది అనే విషయాన్ని ప్రకటించారు. అందుకు కారణం కూడా లేకపోలేదు దేశంలో రాజస్థాన్ తర్వాత అనంతపురం జిల్లా కరువుగడ్డగా పేరు పడింది. తాగడానికి నీళ్లు కూడా దొరకని స్థితిలో ప్రజలు అల్లాడుతున్నారు. రోగాలతో బాధపడుతున్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాడిని. ఈ కరువు పరిస్థితుల్లో పేదరికం పెరిగేలా చేస్తుంది. దీనివల్ల బాధితులు పీడితులు దళితులు వైద్య సేవల కోసం ఇబ్బందులు పడుతుంటారు.
అంత్యోదయ స్ఫూర్తి..
అంత్యోదయ అంటే ఒక విందు భోజనం. బంతిలో కూర్చునే మొదటి వ్యక్తి నుంచి చివరలో ఉన్న వ్యక్తికి కూడా అదే తరహా వడ్డన ఉండాలి. ఈ పదానికి నేను అర్థం చెబుతున్నా అని డాక్టర్ కోనంకి శ్రీధర్ అంటున్నారు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే పేదలైనా, పెద్దలైనా, సంపన్నులైనా నాకు సమానమే. పేదల కోసమే పది రూపాయలు ఫీజు పెట్టాను. రోగం తీసుకున్న వారు క్యూలో రావాల్సి ఉంటుంది. నేను ఎక్కడ సిఫారసులకు ఆస్కారం ఇవ్వను. ఇవ్వలేను అని స్పష్టం చేశారు.
పిడికిలి లాంటిదే వైద్యం
వైద్యం ఓ పిడికిలి లాంటిది. ఓ పిల్లాడు ఊర్లో పరిగెడుతున్నాడు. ఆ పిల్లాడి వెనుక ఊరంతా పరిగెడుతున్నారు. ఎట్టకేలకు ఆ పిల్లోడిని ఊర్లో వాళ్ళు పట్టుకున్నారు. మీరు వెంట పడుతుంటే భయపడిన ఏం పరిగెత్తుతున్నా అని సమాధానం ఇచ్చాడు. మరి పిడికిలి ఎందుకు బిగించావంటే, మీరు నన్ను కొడతారేమోనని పిడికిలి బిగించానని సమాధానం ఇచ్చాడంట. పిడికిలి తెరిచి చూస్తే ఏమీ కనిపించలేదు. అని వైద్యానికి ఉన్న నిర్వచనాన్ని ఆయన విశ్లేషించారు. అంటే రోగాలపైన, అవి రాకుండా నివారించాల్సిన పద్ధతులపైన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలి అని శ్రీధర్ విశ్లేషించారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే, మన ఇంట్లో ఏముందో మనకు తెలుసు. పక్కింటి వారింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ మన శరీరంలో ఏమి వ్యాధి ఉంది, అనుభవం అయ్యే పరిస్థితి ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత ధర్మం డాక్టర్ పై ఉంటుంది. తెలుసుకునే బాధ్యత కూడా రోగులపైన ఉండాలి అని డాక్టర్ శ్రీధర్ అంటున్నారు.
నా తమ్ముడే.. నా బలం..

పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు అంటారు. ఆస్తుల కోసం మమకారాలను కూడా వదులుకుంటున్న ఈ రోజుల్లో డాక్టర్ శ్రీధర్ కు తమ్ముడు అండగా నిలిచారు. పేదల నుంచి ఫీజు తీసుకోకుండా వైద్యం చేస్తున్న డాక్టర్ శ్రీధర్ కు తమ్ముడు సుధీర్ కుమార్ వెన్నెముకల నిలిచారంటే నమ్మక తప్పదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సుధీర్ కుమార్ తాను సంపాదిస్తున్న మొత్తం నుంచి 90% వైద్య సేవల కోసమే అందిస్తున్నారంటే, ఆశ్చర్యం కలగక మానదు.
"20 సంవత్సరాలకు సరిపడ నిధులను ఫిక్స్ డిపాజిట్ చేశాడు" అందులో నుంచి నాకు జీతం జీవనం గడుపుతున్నా అని డాక్టర్ శ్రీధర్ వివరించారు. మేము ఎవరి దగ్గర నుంచి విరాళాలు తీసుకోము. ఏ ఆర్గనైజేషన్ లేదు. చందాలు తీసుకోము. అని స్పష్టం చేశారు.
తండ్రే దైవం..


"విదేశాల్లో ఉన్నప్పుడు కొన్నేళ్ల పాటు మా నాన్నకు దూరంగా ఉన్నాను. నాకు ప్రమాదం జరిగినప్పడు మాత్రం తెల్లవారే వరకు ఆయన నాతోనే ఉండేవారు" గతాన్ని అలా నా తండ్రితో కాలం వెళ్లదీశానని డాక్టర్ శ్రీధర్ గుర్తుకు చేసుకున్నారు. ఒకరోజు ఆయన కూర్చీలో కూర్చుని అలాగే ఒదిగిపోయాయి. ప్రాణాలు వదలడం జీర్ణించుకోలేకపోయా. అందుకే మా నాన్న నాతో ఎప్పుడు ఎండాలి. ఉన్నారనే ఇంటి ఆవరణలోనే విగ్రహం ఏర్పాటు చేయించా" అని శ్రీధర్ వివరించారు.

సొంత భవనంలోనే ..
మా సొంత భవనంలోనే ఆసుపత్రి నిర్వహిస్తున్నాము . మాది రైతు కుటుంబం. సాయంత్రం తోటల వద్దకు వెళ్లి పనులు చూసుకుంటా. చీనీ, టమాటా తోటలు ఉన్నాయి. నాకు వచ్చిన సంపాదన నుంచి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నా. అని డాక్టర్ కోనంకి శ్రీధర్ వివరించారు. నా కుటుంబ సభ్యులకే స్వయంగా నేను వైద్యం చేసినంత ఆనందఃను భౌతిక లోనవుతున్న అని ఆయన వైద్య వృత్తికి పట్ల ఉన్న అంకిత భావం ప్రేమానురాగాలను వివరించారు.
విస్తరించాలి..
రోజూ తన వద్దకు 100 మంది రోగులు పరీక్షల కోసం వస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ చెప్పారు. నా వద్ద ఉన్న ఆధునాతన పరికరాలతో వారందరికీ సేవలు అందిస్తున్నా. తప్పదు అని భావిస్తే, అనంతపురం పెద్దస్పత్రి ఎముకల డాక్టర్ల వద్దకు నా లెటర్ హెడ్ పైనే సిఫారసు చేస్తున్నా, అక్కడ కూడా నా దగ్గర నుంచి వెళ్లిన రోగులకు మెరుగైన చికిత్స చేస్తున్నారు. అక్కడ పరీక్షలు చేయించుకున్నట్లు ఫొటోలు కూడా పంపిస్తుంటారని డాక్టర్ శ్రీధర్ వివరించారు.
Tags:    

Similar News