ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు

ఒకటి కృష్ణా జిల్లాలో, మరొకటి బాపట్ల జిల్లాలో యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి.;

By :  Admin
Update: 2025-03-31 15:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం రెండు వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలో చోటు చేసుకోగా, మరొకటి బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో ఒక పసికందు కూడా ఉంది. బాపట్ల జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ పెనుమూడి వారధి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యయి. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో ఓ పసి బిడ్డ కూడా ఉంది. మరణించిన వారిలో ఒకరు తెనాలికి చెందిన జిడుగు రామ్మోహన్‌గా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని వైద్య చికిత్సల కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం రొంపేరు వద్ద సోమవారం సాయంత్రం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, రెండు ఆటోలు ఢీకొట్టుకోవడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు ఆటల్లో కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో 20 మంది కూలీలు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి కూలీల పరిస్థితిలో విషమంగా ఉంది. తీవ్ర గాయపడిన క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం చీరాల ఏరియా ఆసుత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags:    

Similar News