తెలంగాణాలో సీడ్ గార్డెన్ ఏర్పాటు

తెలంగాణాలో కూడా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని అందుకు సహకరించాలని ఎప్జీవీ కంపెనీ యాజమాన్యాన్ని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

Update: 2024-10-24 11:59 GMT

తొందరలోనే తెలంగాణాలో సీడ్ గార్డెన్ ఏర్పాటు జరగబోతోంది. ఆయిల్ పామ్(Oil Palm) పంటల గురించి అధ్యయనం చేయటానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar Rao) మూడురోజులుగా మలేషియాలో (Malaysia)పర్యటిస్తున్నారు. ఆయిల్ పామ్ పంటలకు మలేషియా చాలా పాపులర్. మలేషియాలోని అతిపెద్ద కమర్షియల్ యూనిట్ ఎఫ్జీవీ కంపెనీ సీడ్ గార్డెన్(FGV Company Seed Garden) ను మంత్రి, ఉన్నతాధికారులు సందర్శించారు. నర్సరీలు, అధునాతన సాంకేతిక పద్దతుల్లో ఏర్పాటైన విత్తన కేంద్రాన్ని కూడా పరిశీలించారు. నర్సరీల పెంపకం, విత్తన కేంద్రం నిర్వహణ తదితర వ్యవహారాలపై మంత్రి, ఉన్నతాధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణాలో కూడా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని అందుకు సహకరించాలని ఎప్జీవీ కంపెనీ యాజమాన్యాన్ని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

కంపెనీ యాజమాన్యం స్పందిస్తు తెలంగాణా(Telangana) ప్రభుత్వంకు సహకరించటమే కాకుండా భాగస్వామ్య పద్దతిలో పనిచేయటానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇదే సందర్భంగా మంత్రి, ఉన్నతాధికారులు కంపెనీ రిఫైనరీ ఫ్యాక్టరీని కూడా సందర్శించటమే కాకుండా తయారయ్యే ఉత్పత్తులను కూడా పరిశీలించారు. ఉత్పత్తుల నిల్వకు, ఎగుమతులకు, కంపెనీ తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోవటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి కూడా వివరాలు తీసుకున్నారు. తొందరలోనే తమ కంపెనీ ప్రతినిధులు తెలంగాణాకు వస్తారని యాజమాన్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హామీ ఇచ్చింది.

Tags:    

Similar News