స్టెల్లాకి మోక్షం..ఆఫ్రికాకు బయలు దేరిన నౌక
కాకినాడ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ ద షిప్ అని అన్న మాటలు వైరల్‌గా మారాయి.;
స్టెల్లా షిప్ పేరు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో మారు మోగింది. సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరలయ్యాయి. ఈ స్టెల్లా షిప్‌ను ఉద్దేశించే నాడు పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలతో స్టెల్లా షిప్‌కు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంలో ఈ స్టెల్లా షిప్ తెరపైకొచ్చింది. కాకినాడ పోర్టు నుంచి ఈ స్టెల్లా షిప్‌లో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రావాణా చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ స్టెల్లా షిప్ ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నవంబరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. నాటి నుంచి ఇది కాకినాడ పోర్టులోనే ఉండి పోయింది. దాదాపు 55 రోజుల పాటు లంగరు వేసుకొని కాకినాడ పోర్టు సముద్రంలో ఉండి పోయింది. తాజాగా దీనికి అనుమతులు లభించాయి. తిరిగి ఆఫ్రికాకు వెళ్లేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ అనుమతులు జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజామున స్టెల్లా షిప్ పశ్చిమ ఆఫ్రికాకు బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 1320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఈ స్టెల్లా షిప్‌లో ఉన్నట్లు డిసెంబరులు జిల్లా కలెక్టర్ గుర్తించారు. తర్వాత వీటిని షిప్ నుంచి అన్‌లోడ్ చేసి అక్కడ నుంచి గోడౌన్‌లకు తరలించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో స్టెల్లా షిప్ తిరిగి పశ్చి ఆఫ్రికాకు వెళ్లేందుకు అధికారులు అనుమతులిచ్చారు. అయితే ఈ షిప్ పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు దాదాపు 26 రోజులు పట్టే అవకాశం ఉంది.