సజ్జల మరో నాలుగు వారాలు సేఫే.. తర్వాత ?
సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పట్లో కఠిన చర్యలు తీసుకోవద్దు. నాలుగు వారాల పాటు ఆయన్నేమీ అనొద్దు హైకోర్టు ఆదేశాలు.
వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే టీడీపీ కార్యాలయాలపై దాడిని సీరియస్‌గా తీసుకుంది. అదే లెవల్లో పోలీసులకు కడా ఆదేశాలు జారీ చేసింది. దాడికి పాల్పడిన వారిని వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్‌లకు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాడులకు పాల్పడ్డారనే కారణాలతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను జైలుకు పంపేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంది. స్థానిక పోలీసుల నుంచి ఈ కేసులను ప్రత్యేకించి సీఐడీకీకి బదలాయింపులు చేపట్టింది. ఇలా ఒక పక్క ఈ కేసుల విచారణలో వేగం పెంచుతూ.. మరో పక్క వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, శ్రేణుల మీద ప్రెషర్ పెంచే విధంగా ఎత్తుగడలు వేసింది. సజ్జల రామకృష్ణారెడ్డిపైన ఏకంగా ఎల్‌ఓసి నోటీసులను కూడా జారీ చేసింది.