ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల కేసులు (వీడియోలు)

బస్సు ప్రమాదంలో 20 మంది సజీవదహనం అవ్వటం దేశంలో సంచలనంగా మారింది. రెండు తెలుగు ప్రభుత్వాలు ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నాయి

Update: 2025-10-25 09:06 GMT
RTA officials and police conducting raids on Private busses

శనివారం ఉదయం నుండి రవాణాశాఖ అధికారులు పోలీసులసాయంతో ప్రైవేటు ట్రావెల్స్ సంస్ధలు బస్సులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికి సుమారు 70 బస్సులను తనిఖీలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు, చిన్నటేకూరు దగ్గర ప్రైవేటు బస్సు మంటలకు దగ్ధమైన విషయం తెలిసిందే. కర్నూలు(Kurnool bus accident) బస్సు ప్రమాదంలో 20 మంది సజీవదహనం అవ్వటం దేశంలో సంచలనంగా మారింది. రెండు తెలుగు ప్రభుత్వాలు ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దాంతో హైదరాబాదు(Hyderabad)లోని ఆర్టీఏ అధికారులకు చురుకుపుట్టింది. అందుకనే శనివారం ఉదయం నుండి ప్రైవేటు ట్రావెల్స్(Raids on Private Travels) బస్సులపైన దాడులు మొదలుపెట్టారు. వీళ్ళదాడుల్లో సుమారు 60 బస్సుల్లో ఏదో ఒక సమస్యున్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యంటే బస్సుకు సరైన ఫిట్ నెస్ లేకపోవటం, పర్మిట్ లేకపోవటం లేదా ఒకరాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించి తెలంగాణలో తిప్పుతిండటం, అగ్నిప్రమాదాల నివారణలకు ఉపయోగించే సిలిండర్లు లేకపోవటం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవటం అన్నమాట.

ప్రమాదాలు జరిగినపుడు లోపలున్న ప్రయాణీకులు బయటపడటానికి మామూలుగా చేసేపని ఏమిటంటే బస్సు అద్దాలను పగలగొట్టడం. అద్దాలు పగలగొట్టాలంటే అవి చాలా దళసరిగా ఉంటాయి కాబట్టి అంతతొందరగా పగలవు. ఏదైనా గట్టి వస్తువుతో బలంగా కొట్టినపుడు మాత్రమే పగులుతాయి. ప్రయాణీకుల దగ్గర అప్పటికప్పుడు గట్టి వస్తువులు ఎందుకుంటాయి ? అందుకనే ప్రతి బస్సులోను హ్యామర్లు(సుత్తులు) ఉంచాలి. అవసరం వచ్చినపుడు ఆ సుత్తులను ప్రయాణీకులు ఉపయోగించి అద్దాలను పగలగొట్టి బయటపడతారు.

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సులో అలాంటి హ్యామర్స్ కూడా లేవు. అలాగే ఆర్టీఏ అధికారులు దాడుల్లో గమనించింది ఏమిటంటే అలాంటి సుత్తులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు చాలా బస్సుల్లో లేవని. అలాగే మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్లు కూడా లేవు. హైదరాబాద్ నుండి ప్రతిరోజు ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు ట్రావెల్స్ బస్సులు సుమారు వెయ్యిబస్సులు తిరుగుతుంటాయి. వీటిల్లో అన్నీరకాలుగా ఫిట్ గా ఉండే బస్సుల సంఖ్య తక్కువనే చెప్పాలి. ప్రతిబస్సులోను ఏదో ఒక లోపముంటుంది. అయినా యాజమాన్యాలు లేదా డ్రైవర్లు లోపాలను సరిదిద్దకుండా నడిపేస్తుంటారు. కర్నూలు దగ్గర జరిగినట్లుగా ఎక్కడైనా ప్రమాదం జరిగినపుడు వెంటనే రవాణాశాఖ అధికారులు దాడులపేరుతో హడావుడి మొదలుపెట్టేస్తారు. రెండురోజులు దాడులు చేసి కేసులు బుక్ చేసిన తర్వాత మళ్ళీ మూడోరోజు నుండి అంతా మళ్ళీ మామూలే.

హైదరాబాద్ నుండి రోజుకు 150 ప్రైవేటుబస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు భువనేశ్వర్, గోవా, షిర్డి, ముంబాయ్, ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్, మైసూర్ కు కూడా రోజు వెళుతునే ఉంటాయి. ఈరోజు రవాణాశాఖ అధికారులు ఎల్బీ నగర్, శంషాబాద్, కుకట్ పల్లిలో ప్రైవేటు బస్సులపై దాడులు చేశారు. నిబంధనలను పాటించని కొన్ని బస్సులను సీజ్ చేసి 54 కేసులు నమోదుచేశారు. బ్రేక్ ఇన్స్ పెక్టర్లు, ఆర్టీవోలు ఏడు బృందాలుగా విడిపోయి హైదరాబాదులో ఉన్న ట్రావెల్స్ ఆపీసులు, బస్సులపై దాడులు, తనిఖీలు చేశారు.

Tags:    

Similar News