కవితకు బెయిల్ దారే కనబడటంలేదా ?

కల్వకుంట్ల కవితకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తనకు బెయిల్ మంజూరుచేయాలని కవిత పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను రౌస్ ఎవిన్యు కోర్టు డిస్మిస్ చేసింది.

Update: 2024-05-20 12:23 GMT

కల్వకుంట్ల కవితకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తనకు బెయిల్ మంజూరుచేయాలని కవిత పెట్టుకున్న బెయిల్ పిటీషన్ను రౌస్ ఎవిన్యు కోర్టు డిస్మిస్ చేసింది. జూన్ 3వ తేదీవరకు జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తు జడ్జి కావేరి భవేజా తీర్పిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ ల్యాండరింగ్ చట్టంకింద కవితను ఈడీ అరెస్టుచేసింది. అంతకుముందు లిక్కర్ స్కామ్ లో పాత్రపై కవితను ఈడీ రెండురోజులు విచారించింది. తర్వాత కొంతకాలం గ్యాపిచ్చి మళ్ళీ విచారణకు పిలిచింది. అయితే మొదటిసారి విచారణకు హాజరైన కవిత ఆ తర్వాత ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. కవితను విచారణకు రమ్మని ఈడీ ఏడుసార్లు నోటీసులిచ్చినా కవిత పట్టించుకోలేదు. పైగా తనను ఈడీ విచారించటాన్ని అభ్యంతరం వ్యక్తంచేస్తు కోర్టులో కేసు కూడా వేశారు.

కొంతకాలం కవిత వైఖరిని గమనించిన ఈడీ తర్వాత రూటుమార్చుకుని లిక్కర్ స్కామ్ అని కాకుండా మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చి ఇంట్లోనే కవితను విచారించారు. రెండురోజులు విచారణ తర్వాత అరెస్టుచేసి ఢిల్లీకి తీసుకెళ్ళారు. మార్చిలో అరెస్టయిన కవిత ఇప్పటికీ ఢిల్లీలోని తీహార్ జైలులోనే ఉన్నారు. ఈడీ అరెస్టుకు అనుబంధంగా సీబీఐ కూడా లిక్కర్ స్కామ్ లో కవితను సమాంతరంగా విచారిస్తోంది. సీబీఐ విచారణను కవిత ఎంతగా వ్యతిరేకించినా కోర్టు పట్టించుకోలేదు. జైలులోనే కవితను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతులిచ్చింది. గడచిన మూడునెలలుగా కవిత ఎన్నిసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసినా కోర్టు అన్నింటినీ కొట్టేస్తోంది. ముందేమో కొడుకు చదువు, పరీక్షల పేరుతో బెయిల్ కావాలని కవిత కోరితే కోర్టు అంగీకరించలేదు. తర్వాత అనారోగ్యంగా ఉందికాబట్టి బెయిల్ కావాలంటే కుదరదని చెప్పేసింది. ఆతర్వాత ఎన్నికల్లో తాను స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ప్రచారంచేయటానికి బెయిల్ ఇవ్వాలని అడిగితే లాభంలేకపోయింది.

తనను వర్చువల్ గా కాకుండా నేరుగా కోర్టులోనే విచారించాలని కవిత అడిగితే కొన్నిసార్లు నేరుగాను మరికొన్నిసార్లు వర్చువల్ గాను కోర్టు విచారిస్తోంది. బెయిల్ కోసం కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం కబడటంలేదు. మొదట్లో విచారణకు కవిత కోర్టుకు వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడుతు కోర్టు నిర్ణయాలను తప్పుపట్టేట్లుగా మాట్లాడారు. దాంతో జడ్జి భవేజాకు బాగా కోపం వచ్చింది. విచారణకు హాజరైన నిందితురాలు మీడియాతో మాట్లాడటం ఏమిటంటు చివాట్లుపెట్టారు. ప్రతిసారి ఇలాగే కవిత వ్యవహరిస్తున్నారు కాబట్టే నేరుగా కాకుండా వర్చువల్ గా విచారించాలని కోర్టు అనుకున్నట్లుంది.

మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన వాళ్ళకి బెయిల్ అంత తొందరగా రాదని న్యాయవాదులు అంటున్నారు. కవిత బాగా పలుకుబడికలిగిన రాజకీయ నేత కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వకూడదన్న ఈడీ, సీబీఐ లాయర్ వాదనతో కోర్టు కూడా ఏకీభవిస్తున్నట్లుంది. అందుకనే ఏ కారణంతో బెయిల్ పిటీషన్ వేసినా జడ్జి కొట్టేస్తున్నారు. చార్జిషీటు వేసిన తర్వాత ఇక కవితను కస్టడీలో పెట్టుకోవటంలో అర్ధంలేదని కవిత తరపున లాయర్లు ఎంత వాదించినా ఉపయోగం కనబడలేదు. ఇదే కేసులో అరెస్టయి కొన్నినెలలు జైలులో ఉండి బెయిల్ మంజూరైన శరచంద్రారెడ్డికి కోర్టు బెయిల్ ఎలా ఇచ్చిందని, బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన వెంటనే శరత్ కు బెయిల్ వచ్చిందన్న అర్ధమొచ్చేట్లుగా కవిత బహిరంగంగా ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు చాలామంది మీద చేశారు. దాంతో కవిత వైఖరిపై కోర్టుకు మండినట్లుంది. అందుకనే బెయిల్ పిటీషన్ విషయంలో ఏమాత్రం కనికరంచూపటంలేదు. మరి కవిత ఎంతకాలం జైలులో ఉంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News