రోజా ఒపీనియన్ పోల్‌లో బాబుకు జైజైలు.. ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి..

రోజా పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌లో నిర్వహించిన పోల్‌లో చంద్రబాబుకు జైజైలు కొట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు.

Update: 2024-09-24 14:34 GMT

రోజా పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌లో నిర్వహించిన పోల్‌లో చంద్రబాబుకు జైజైలు కొట్టిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించే ఈ పోల్ నిర్వహించినట్లు ఆ ఫొటోలు చూపుతున్నాయి. ఈ విషయంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్‌కే రోజా ఘాటుగా స్పందించారు. ఆ ఫొటోలన్నింటిని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా ఓ అధికారిక పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా అసలు తనకు ఎటువంటి యూట్యూబ్ ఛానెల్ లేదని కూడా ప్రకటించారు. కొందరు కావాలనే తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌లా పెట్టి.. అందులో ఆ పోల్ పెట్టారని ఆరోపించారు. ఆ విధంగా తమ సొంత ప్రయోజనాల కోసమే, మరేదైనా కారణమైనా తన పేరిట పెట్టిన యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాలను వెంటనే డిలీజ్ చేసేయాలని హెచ్చరించారు. అలా చేయని పక్షంలో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, చట్టపరమైన చర్యలకు దిగుతానంటూ తేల్చి చెప్పారు.

నాకసలు ఛానెలే లేదు: రోజా

‘‘అందరికీ నమస్కారం!! నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్ లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను’’ అని రోజా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

దుమారం రేపుతున్న లడ్డూ లడాయి..

ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్ాయయి. కొందరు న్యాయవాదులు నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖలు రాశారు. తిరుపతి లడ్డూ అంశంలో జోక్యం చేసుకోవాలని, సీనియర్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో తిరుపతి లడ్డూ వివాదంపై దర్యాప్తు చేపట్టాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తిరుపతి ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో నిజంగా జంతువుల కొవ్వు కలిసి ఉంటే దానిని నిరూపించే ఆధారాలు ఇప్పటి వరకు ఎందుకు చూపలేదని కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా అంటరాని వాడిని చేయడం కోసమే.. చంద్రబాబు ఈ పన్నాగం పన్నారన్న ప్రచారం కూడా భారీగానే జరుగుతోంది. కాగా తిరుమల ప్రతిష్టకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగించిందని, వైసీపీ హయాంలో ఎక్కడాలేనటువంటి అపచారాలు జరిగాయని టీడీపీ శ్రేణులు ఘంఠాపథంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ క్రమంలో రోజా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిన ఒపీనియన్ పోల్‌లో చంద్రబాబుకు జైజైలు కొట్టడం కీలకంగా మారింది.

Tags:    

Similar News