వేగుచుక్క ఏచూరి..!

తిరుపతిలో సీతారామ్ ఏచూరికి నివాళి

By :  Admin
Update: 2024-09-18 12:05 GMT

దేశంలో లౌకిక వాదాన్ని బలపరిచేందుకు, దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి, యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో వేగుచుక్క ఏచూరి అని వక్తలు ఉద్గాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తిరపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ జి సుబ్రమణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పిఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత దేశ రాజకీయాలలో విలువల కలిగిన నెంబర్ వన్ వ్యక్తి ఏచూరి, నైతిక విలువలు కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిక్సూచి అన్నారు. మేదో శక్తితో కూడిన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని అని కొనియాడారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులను ప్రభావితం చేసిన వ్యక్తి అని, సంకీర్ణ రాజకీయాలను నడిపేందుకు అందర్నీ ఏకతాటిపైకి నిలిపిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు. విద్యార్థి దశ నుంచి ఆయనని ఎరుగుదునని, 1985 నుంచి ప్రత్యక్షంగా ఆయనతోపాటు జాతీయ రాజకీయాల్లో నడిచానని గుర్తు చేశారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు శ్రేణులు నిరాశ చెందకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.




 


టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పుస్తకాన్ని చదవటం కాదు అందులోని విషయపరిజ్ఞానాన్ని అవగాహన చేసుకున్న ఆచరించడం ముఖ్యమని పేర్కొన్నారు. పుస్తక పటనంలో కమ్యూనిస్టులు అందవేసిన చేయని, ప్రస్తుత పార్లమెంటు సభ్యులలో 90 శాతం పైగా కనీసం నాలుగు పుస్తకాలు చదివిన ఘనత లేదని తెలిపారు. అభ్యుదయ ఉద్యమాలు బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరి ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక సిద్ధాంతాన్ని నమ్మి, దేశ రాజకీయాలలో దాని చుట్టూ తిరిగేలా, ఆ సిద్ధాంతాన్ని అందరికీ దగ్గరయ్యేలా చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఏకతాటిపై తేవడంలో ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఆయనకు నివాళి అర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఆయన దేశ రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపించాడో అర్థమవుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్పిఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కోశాధికారి కేవీ చౌదరి, సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ, తిరుపతి బాల్వాత్సవం చైర్మన్ టెంకాయల దామోదరం, సిపిఎం, సిపిఐ నాయకులు టి.సుబ్రమణ్యం, డి.జనార్థన్ కార్యకర్తలు, వామపక్ష నాయకులు శ్రేయోభిలాషులు అభిమానులు పాల్గొన్నారు.

Tags:    

Similar News