చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ చెక్ పెట్టారా!

పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. సీఎంలు ఎక్కడిక్కడ పెట్టుబడులకు పిలుపునివ్వడమే ఇందుకు నిదర్శనం.

Update: 2024-07-21 09:13 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో పలుమార్లు వెల్లడించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాము ఆ దిశగా అడుగులు వేస్తున్నామని, సంపద సృష్టించడం అంటే రోజుల్లో జరిగిపోయే పని కాదని చంద్రబాబు వివరించారు. కానీ తమ ప్రభుత్వం అన్ని మార్గాల్లో సంపద సృష్టించడానిక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇప్పటికే అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. అంతేకాకుండా రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుకురావడం ద్వారా సంపదను సృష్టించవచ్చని యోచించిన బాబు.. ఆంధ్రలో పెట్టుబడులను పెంచే దిశగా పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలను అమరావతికి ఆహ్వానించారు చంద్రబాబు. వీటితోపాటుగా భారీ మొత్తంలో పెట్టబడులను ఆకర్షించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యూహాలు పొరుగు రాష్ట్రం తెలంగాణకు తలపోటుగా మారే అవకాశం ఉందని, ఆంధ్రకు పెట్టుబడులు పెరగడం ద్వారా తెలంగాణకు వచ్చే పెట్టుబడులు గణనీయంగా క్షీణిస్తాయిన కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. వారి వ్యాఖ్యలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. దాంతో ఎక్కడిక్కడ చంద్రబాబు వ్యూహాలకు చెక్ పెడుతూ వస్తున్నారు రేవంత్. ఇందులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారిపైనా, పెట్టబోయే వారిపైనా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్న వారిని కూడా వదలకుండా వారి విషయాల్లో రేవంత్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. వారి దృష్టి తెలంగాణ నుంచి మక్కకు తిరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

రేవంత్ చేస్తున్న ప్రయత్నాలకు శనివారం జరిగిన కమ్మగ్లోబల్ సమ్మెట్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ ఆర్థిక పటిష్టత కోసం ప్రధాని మోదీని బడే భాయ్ అని పేర్కొన్నా రేవంత్.. కమ్మగ్లోబల్ సమ్మిట్‌లో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. కమ్మ సామాజికవర్గం అమ్మలాంటి ప్రేమను అందిస్తుందని, ఈ సామాజికవర్గం వారు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చే ఏ పెట్టుబడి కూడా దారి మళ్లకూడదన్న ఉద్దేశంతోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు వేస్తున్న ప్లాన్స్‌కు కౌంటర్‌గానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గం వారు ఎవరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏపీని ప్రత్యేక స్పాట్‌గా ఎంచుకోకూడదనే వారిపై పొగడ్తల వర్షం కురిపించారని కూడా టాక్ నడుస్తోంది.

ప్రతి ఒక్కరినీ అమరావతికి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానిస్తున్న వేళ ఇప్పటికే పారిశ్రామికంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని, పెట్టుబడులకు హైదరాబాద్ ది బెస్ట్ స్పాట్ అంటూ బాబు వ్యూహాలకు రేవంత్ చెక్ చెప్తున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న వారికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయం అందిస్తుందన్న రేవంత్ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి రేవంత్ వ్యూహాలను బ్రేక్ చేస్తూ అమరావతికి పెట్టుబడులు తీసుకురావడంలో, ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించడంలో చంద్రబాబు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News